Bhashyam Blooms: సీబీఎస్ఈ పది ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్ విజయభేరి
ABN, Publish Date - May 14 , 2025 | 06:31 AM
సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించారు. శ్రీహర్ష 492 మార్కులతో ప్రధానంగా నిలిచిన వారిలో 23 మంది 480కి పైగా మార్కులు సాధించారు.
492 మార్కులతో సంచలనం సృష్టించిన ఎస్.కె.ఎం.శ్రీహర్ష
గుంటూరు(విద్య), మే 13(ఆంధ్రజ్యోతి): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎ్‌సఈ) విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్ విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భాష్యం బ్లూమ్స్ విద్యార్థి ఎస్.కె.ఎం.శ్రీహర్ష 500 మార్కులకు గాను 492 మార్కులు సాధించి భాష్యం విద్యా సంస్థలకు గర్వకారణంగా నిలిచారన్నారు. అదే విధంగా ఎ.సాయినిఖిత 490, టి.అనీష్ 489, బి.లిఖిత్ మనోఘ్న్ 488, పి.శ్రీసాయి మిత్ర 488, ఎ.శ్రీహరిణి 488, యు.యశ్వంత్ సాయి 486, కె.స్నిగ్థ 485, ఎస్.మణియశ్వంత్ 485, పియూష్ ఫోడికర్ 485, ఇ.రిషిక 485, డి.శ్రీహరిణి 485 మార్కులు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు 23 మంది 480కి పైగా మార్కులు, 470కి పైగా 63 మంది, 450కి పైగా 146 మంది అత్యధిక మార్కులు సాధించారన్నారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 06:31 AM