ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bandaru Dattatreya: నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు రండి

ABN, Publish Date - May 19 , 2025 | 04:52 AM

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జూన్ మొదటి వారం హైదరాబాద్‌లో జరిగే తన ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తదితరులను ఆహ్వానించారు. ఈ పుస్తకం హిందీ వెర్షన్ అనంతరం తెలుగులో కూడా విడుదల చేయబడుతుంది.

  • ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలకు దత్తన్న ఆహ్వానం

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగే తన ఆత్మకథ తెలుగు పుస్తక ఆవిష్కరణకు రావాలంటూ ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిలను హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలను ఆదివారంనాడు హైదరాబాద్‌లోని వారి నివాసాల్లో కలిసిన దత్తాత్రేయ.. ఈమేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దత్తాత్రేయ ఆత్మకథ హిందీ వెర్షన్‌ ‘‘జనతాకీ కహానీ.. మేరీ ఆత్మకథ’’ పేరుతో ఇటీవల ఢిల్లీలో విడుదలైన సంగతి తెలిసిందే. దాన్ని ‘‘ప్రజల కథే.. నా ఆత్మకథ’’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఆయనతో పాటు అలయ్‌బలయ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బండారు విజయలక్ష్మి, జిగ్నేషరెడ్డి ఉన్నారు.

Updated Date - May 19 , 2025 | 04:53 AM