ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Arvensis Group: సీబీజీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆస్ట్రేలియా కంపెనీ ఆసక్తి

ABN, Publish Date - May 02 , 2025 | 06:35 AM

ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్‌ గ్రూప్‌ రాష్ట్రంలో రూ. 150 కోట్లతో సీబీజీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపించింది. తాడేపల్లిలో మంత్రి గొట్టిపాటిని కలిసి ప్రతినిధులు సమావేశమయ్యారు.

రాష్ట్రంలో 150 కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ఆర్వెన్సిస్‌

ఇంధన మంత్రి గొట్టిపాటితో కంపెనీ ప్రతినిధుల భేటీ

ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: మంత్రి

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్‌ కంపెనీలు ముందుకొస్తున్నాయి. రూ. 150 కోట్ల పెట్టుబడితో ఏటా 12-20 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్‌ గ్రూప్‌ ఆసక్తిని చూపింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యి తమ ఆసక్తిని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో సంస్థల ఏర్పాటుకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ఆర్వెన్సిస్‌ ప్లాంటు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చే ఉద్యోగావకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరితగతిన సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి కోరారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 06:35 AM