ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Atrocity Case: వంశీపై సత్యవర్థన్ సోదరుడు ఫిర్యాదు.. అట్రాసిటీ కేసు నమోదు

ABN, Publish Date - Feb 13 , 2025 | 09:19 PM

Atrocity Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. సత్యవర్థన్ సోదరుడు కిరణ్ ఫిర్యాదు చేయడంతో పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఇక వంశీతోపాటు మిగిలిన నిందితులను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వారిని మేజిస్ట్రేట్ ఎదుట హజరుపరిచే అవకాశముందని సమాచారం.

విజయవాడ, ఫిబ్రవరి 13: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులకు సత్యవర్థన్ సోదరుడు కిరణ్ ఫిర్యాదు చేశాడు. స్థానిక పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వల్లభనేని వంశీపై కిడ్నాప్‌‌నకు సంబంధించిన సెక్షన్లతోపాటు అట్రాసిటీ కేసు సైతం నమోదు చేశారు. అలాగే ఇదే కేసులో వల్లభనేని వంశీతోపాటు కొమ్మా కొట్లు, రామకృష్ణ, వీర్రాజులను పోలీసులు నిందితులుగా చేర్చారు. అనంతరం వారందరిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఈ కేసులో ఏ 7 ఏలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, ఏ8 నిమ్మ లక్ష్మీపతిని సైతం వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. సరైన చర్యలు తీసుకోలేదు. ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో సత్యవర్థన్ ఫిర్యాదు చేశారు. కానీ అంతలోనే ఆయన తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. దాంతో వైసీపీ నేతల ఒత్తిడి కారణంగానే ఈ కేసు వెనక్కి తీసుకున్నారంటూ ఓ చర్చ జరిగింది.


దీంతో సత్యవర్థన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. వాస్తమని తెలింది. ఆ క్రమంలో వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో ఫిబ్రవరి 13న ఉదయం అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం అతడిని విజయవాడ తరలించారు. ఈ సందర్భంగా వంశీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక విశాఖపట్నంలో ఉన్న సత్యవర్థన్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని.. రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.

Also Read: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన


ఆ క్రమంలో అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్ట్‌తోపాటు సత్యవర్థన్ నివేదికను సైతం పోలీసులు పరిశీలించనున్నారు. అలాంటి వేళ.. సత్యవర్థన్ సోదరుడు కిరణ్ ఫిర్యాదు చేయడంతో వంశీతోపాటు పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వల్లభనేని వంశీకి బిగుస్తున్న ఉచ్చు

Also Read: అన్ బిల్డ్‌కి, అవుట్ స్టాండింగ్‌కి తేడా తెలుసా?
Also Read: లోపాయికారీ ఒప్పందం లేదు.. దాపరికం లేదు..

Also Read: ఫాస్టాగ్ కొత్త రూల్స్.. ఇలా పెనాల్టీలు తప్పించుకోవచ్చు..

Also Read: కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Also Read: చవితి వేడుకలకు ప్రధాని హాజరు స్పందించిన రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 09:19 PM