Share News

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Feb 13 , 2025 | 08:14 PM

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన ఫిర్యాదు చేసి.. వెనక్కి తీసుకున్న సత్యవర్థన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడకు తీసుకు వచ్చి.. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగుస్తున్న ఉచ్చు

అమరావతి, ఫిబ్రవరి 13: మాజీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో ఫిర్యాదు విత్ డ్రా చేసుకున్న సత్యవర్థన్‌ను వైజాగ్‌లో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని కొద్దిసేపటి క్రితం విజయవాడకు తీసుకు వచ్చారు. అనంతరం రహస్య ప్రదేశంలో సత్యవర్థన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అందులోభాగంగా అతడి స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక పోలీస్ బృందం రికార్డు చేస్తోంది.

ఈ స్టేట్‌మెంట్‌ను సైతం వంశీ రిమాండ్ రిపోర్ట్‌కు పోలీసులు జత చేయనున్నారు. అలాగే ఇటీవల ఇదే సత్య వర్ధన్ ఫిర్యాదు విత్ డ్రా చేసుకోవడం వెనుక ఎవరున్నారనే అంశంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అ విషయాలు సైతం బయటకు వస్తే.. ఆ తర్వాత వల్లభనేని వంశీతోపాటు పలువురికి ఉచ్చు మరింత బిగుస్తుందనే చర్చ సైతం సాగుతోంది.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీతోపాటు మరో 87 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అయితే రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు.


అయితే వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరింపులు దిగారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. అందుకే అతను కేసు వెనక్కి తీసుకున్నారని పోలీసులకు చెప్పారు. ఈ మేరకు సత్యవర్ధన్‌ను పోలీసులు విచారించగా వాస్తమని తేలింది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకు వచ్చారు.

Also Read: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన


ఇక అతడిపై మరో రెండు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో.. గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీతోపాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మట్టి కుంభకోణంపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసులు సైతం అతడిపై నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also Read: అన్ బిల్డ్‌కి, అవుట్ స్టాండింగ్‌కి తేడా తెలుసా?


మరోవైపు.. నకిలీ పట్టాల కేసులో వల్లభనేని వంశీ పాత్ర లేదంటూ గతంలో పోలీసులు తేల్చారు. కానీ ఈ కేసులో విషయంలో అప్పట్లో విచారణ సరిగ్గా జరగలేదంటూ ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఈ కేసులను రీ ఓపెన్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయా కేసులు పునః విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: లోపాయికారీ ఒప్పందం లేదు.. దాపరికం లేదు..

Also Read: ఫాస్టాగ్ కొత్త రూల్స్.. ఇలా పెనాల్టీలు తప్పించుకోవచ్చు..

Also Read: కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Also Read: చవితి వేడుకలకు ప్రధాని హాజరు స్పందించిన రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 08:15 PM