BRS Party: లోపాయికారీ ఒప్పందం లేదు.. దాపరికం లేదు..
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:11 PM
BRS Party: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ తెలిపారు. ఈ నేపధ్యంలో పార్టీలోని నేతలంతా నిరాశ, నిస్పృహలో ఉన్నామన్నారు. ఉన్న మాటే తాను చెప్తున్నానని.. అందులో దాపరికం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం లేదని మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో తాము పాల్గొన లేదన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు తము దూరంగా ఉన్నామని వివరించారు. అదీకాక ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తప్పిదాలున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో సైతం బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయని సందర్భాలున్నాయని గుర్తు చేశారు.
దేశంలో జనాభా లెక్కింపు కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని మోదీ సర్కార్‌ను ఆయన డిమాండ్ చేశారు. కుల గణన నుంచి తప్పించుకోవటానికే ప్రధాని నరేంద్ర మోదీ.. జన గణన చేయటం లేదని ఆరోపించారు. డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు నుంచి తప్పించుకోవాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. డీ లిమిటేషన్ జరిగితే.. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
2026లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ వలన వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. జనాభా లెక్కల కోసం రూ.8 వేల కోట్లు అవసరం ఉంటే.. కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ. 574 మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. గుడ్డి ఎద్దు చేనులో పడినట్లు.. మోదీ పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2011లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. పేదలకు రేషన్ ఇవ్వటం ఇష్టం లేక పోవడం వల్లే జనాభా లెక్కలకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.
Also Read: చవితి వేడుకలకు ప్రధాని హాజరు స్పందించిన రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
జనాభా లెక్కింపు జరిపితే కొత్తగా 10 కోట్ల మందికి నూతన రేషన్ కార్డులు వస్తాయని బీఆర్ఎస్ ఎంపీ బి. వినోద్ కుమార్ వివరించారు. మరోవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. దీంతో పార్టీలోని నేతలంతా నిరాశ, నిస్పృహలో ఉన్నామని మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఉన్న మాటే చెప్తున్నాను. దీనిలో దాపరికం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఫాస్టాగ్ కొత్త రూల్స్.. ఇలా పెనాల్టీలు తప్పించుకోవచ్చు..
For Telangana News And Telugu News