APRTC: ఆర్టీసీకి 1,400 కొత్త బస్సులు
ABN, Publish Date - Jun 20 , 2025 | 06:42 AM
ఏపీఎ్‌సఆర్టీసీకి 1,400 కొత్త బస్సులు సమకూర్చామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి
విశాఖపట్నం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌సఆర్టీసీకి 1,400 కొత్త బస్సులు సమకూర్చామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. విశాఖలోని ద్వారకా బస్‌స్టేషన్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలను అందించేందుకు అధిక సంఖ్యలో బస్సులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. విశాఖకు కేటాయించిన 100 ఎలక్ర్టిక్ బస్సుల్లో 50 సింహపురి (సింహాచలం) డిపోకు, మరో 50 బస్సులు గాజువాక డిపోకు కేటాయించనున్నట్టు చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్టపడుతుందన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 06:42 AM