APPSC : మే 3 నుంచి గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు
ABN, Publish Date - Jan 22 , 2025 | 05:25 AM
గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు మే 3వ తేదీ నుంచి 9 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
89 పోస్టులకు 4,496 మంది పోటీ
అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు మే 3వ తేదీ నుంచి 9 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. మే 3, 4 తేదీల్లో తెలుగు, ఇంగ్లీష్ అర్హత (క్వాలిఫైయింగ్ నేచర్) పరీక్షలు ఉంటాయి. 5న సమకాలీన అంశాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సాధారణ వ్యాసరూప ప్రశ్నల పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. 6న ఆంధ్రప్రదేశ్, భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీల మీద పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. 7న పాలిటీ, రాజ్యాంగం, పరిపాలన, న్యాయ, విలువలపై పేపర్-3 పరీక్ష జరుగుతుంది. 8న ఆంధ్రప్రదేశ్, భారతదేశ ఎకానమీ, అభివృద్ధిపై పేపర్-4 పరీక్ష నిర్వహిస్తారు. 9న సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ అంశాలపై చివరి పరీక్ష పేపర్-5 ఉంటుంది. 2023లో జారీ అయిన ఈ గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మెయిన్స్‌కు 4,496 మంది ఎంపికయ్యారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 89 గ్రూప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 05:25 AM