ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APNGO Demands: పీఆర్సీని వెంటనే నియమించాలి

ABN, Publish Date - Jul 11 , 2025 | 03:20 AM

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా వెంటనే ప్రభుత్వం పీఆర్సీ పునర్నియమించాలని ఎన్జీవోల సంఘం రాష్ట్ర..........

  • ఏపీ ఎన్జీవో సంఘం

మచిలీపట్నంటౌన్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా వెంటనే ప్రభుత్వం పీఆర్సీ పునర్నియమించాలని ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం రాత్రి మచిలీపట్నం ఎన్జీవో హోంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ఆరేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయు లందరూ తమ హక్కులను కోల్పోయారన్నారు. 11వ పీఆర్సీ రివర్స్‌ పీఆర్సీగా మారిందని, చివరకు ఉద్యోగులు పీఆర్సీ వద్దు అనే విధంగా రూపొందించారన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు రూ.27500 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగో డీఏ ఇవ్వబోతోందని, మూడు డీఏలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కోరుతున్నామన్నారు. సీపీఎస్‌ విధానం సవరించి ఉద్యోగులకు సరైన న్యాయం చేయాలని విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 11 , 2025 | 03:20 AM