ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Govt: పెట్టుబడుల పర్యవేక్షణకు‘స్టేట్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ గ్రూప్‌’

ABN, First Publish Date - 2025-03-06T07:04:18+05:30

రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటు, వాటి పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రత్యేకంగా ‘‘స్టేట్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ గ్రూప్‌’’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  • చైర్మన్‌గా సీఎం, వైస్‌ చైర్మన్‌గా సీఎస్‌

  • సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటు, వాటి పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రత్యేకంగా ‘‘స్టేట్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ గ్రూప్‌’’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రాజెక్టు పర్యవేక్షణ గ్రూపునకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా, ఇంధనం, పరిశ్రమలు, ఆర్‌ అండ్‌ బీ, టూరిజం, విద్య, మున్సిపల్‌, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శులతో పాటు ఈడీబీ సీఈవో మెంబర్లుగా వ్యవహరిస్తారు. సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. చైర్మన్‌ హోదాలో ఉన్న సీఎం, వైస్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న సీఎస్‌ కొంత మంది మెంబర్లను నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. స్టేట్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ గ్రూప్‌ రాష్ట్ర ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఈడీబీ) పరిధిలో ఉంటుంది. సాధారణ పరిపాలన శాఖ పాలన వ్యవహారాలు చూసుకుంటుంది.

గ్రూప్‌ విధివిధానాలు..

  • రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో కీలకమైన పాత్ర పోషించాలి. రూ. 50 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన పెట్టుబడులను పర్యవేక్షించాలి. ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి. సమస్యలు సులభంగా పరిష్కరించాలి.

  • భారీ ప్రాజెక్టులకు ఆమోదాలు, అనుమతులను ఇవ్వడంతో పాటు వాటిని వేగవంతం చేయాలి. దీనిపై శాఖల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించాలి.

  • ప్రాజెక్టులు సజావుగా ఏర్పాటు చేసేందుకు సంబంధిత విభాగాలు, ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. పురోగతిని పర్యవేక్షించాలి. సకాలంలో సలహాలు, సూచనలు అందించాలి. కేంద్రంలోని పీఎంజీతో సమన్వయం చేసుకుని పనిచేయాలి. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రూపు కృషి చేయాలి.

Updated Date - 2025-03-06T07:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising