AP Medtech Zone : క్యాన్సర్ రోగులకు సొంత జుట్టుతో విగ్గులు
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:21 AM
క్యాన్సర్ రోగులకు చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేసినప్పుడు వారి జుట్టు మొత్తం ఊడిపోతుందన్నారు.
మెడ్‌టెక్ జోన్ ఎండీ జితేంద్రశర్మ
విశాఖపట్నం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా బాధితులకు సంతోషకరమైన జీవనం గడిపేలా ఏపీ మెడ్‌టెక్ జోన్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిందని ఆ సంస్థ ఎండీ జితేంద్రశర్మ మంగళవారం వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేసినప్పుడు వారి జుట్టు మొత్తం ఊడిపోతుందన్నారు. ఇలాంటి వారి సంతోషం కోసం వారి సొంత జుట్టుతోనే తక్కువ ధరలో విగ్గులు తయారుచేసి ఇవ్వాలని నిర్ణయించామని జితేంద్ర చెప్పారు. దీని కోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్‌ను సంప్రదించామన్నారు. క్యాన్సర్ రోగులు చికిత్సకు ముందు జావెద్ హబీబ్ సెలూన్‌కు వెళితే... ఆ జుట్టును అవసరం మేరకు కత్తిరించి, దానికి బార్ కోడింగ్ వేసి, విగ్‌ను తయారు చేసి, తక్కువ ధరకు ఇస్తారని వివరించారు.
Updated Date - Feb 05 , 2025 | 05:21 AM