ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Liquor Scam Case: దుబాయ్, థాయిలాండ్‌లో తలదాచుకున్న నిందితుల కోసం సిట్ వ్యూహాత్మక చర్యలు.!

ABN, Publish Date - Jul 25 , 2025 | 09:51 AM

మద్యం కుంభకోణం కేసులో సిట్ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. దుబాయ్, థాయిలాండ్‌లో తలదాచుకున్న నిందితులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు వ్యూహాలు రచిస్తోంది.

AP Liquor Scam Case

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో సిట్ (Special Investigation Team) దర్యాప్తును ముమ్మరం చేసింది. ముఖ్య నిందితులు దుబాయ్, థాయిలాండ్ వంటి విదేశాలలో తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో, వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ముందుగా విజయవాడ ఏసీబీ కోర్టులో నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని పిటిషన్లు దాఖలు చేయనుంది. ఇవాళ లేదా రేపటిలోగా కోర్టు ఉత్తర్వులు పొందాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వారెంట్లు జారీ అయిన వెంటనే, అన్ని విమానాశ్రయాలకు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయనున్నారు.

నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలవని పరిస్థితుల్లో, తదుపరి దశలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలనే దిశగా కూడా సిట్ ఆలోచనలు చేస్తోంది. ఇందుకోసం కూడా కోర్టులో ప్రత్యేక పిటిషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నిందితులకు సంబంధించిన ఆస్తులపై కూడా దృష్టి పెట్టారు. వారి ఆస్తుల కోసం ప్రత్యేకంగా సోదాలు నిర్వహించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఇవాళ లేదా రేపు ఏడు ప్రాంతాల్లో సోదాలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు దర్యాప్తు స్పష్టంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ప్రధాన నిందితులను అరెస్టు చేయడం సవాల్‌గా మారింది. అయితే, వారి దేశవిదేశీ కదలికలపై నిఘా పెట్టి, చట్టపరంగా వ్యవహరించేందుకు అధికార యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు చేపట్టింది.

కాగా, ఏపీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డికి వచ్చే నెల ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ జులై 20న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 10:05 AM