ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Liquor Scam: శంషాబాద్ కాచారంలో పట్టుబడ్డ 11 కోట్ల వ్యవహారంలో ట్విస్ట్

ABN, Publish Date - Jul 30 , 2025 | 06:21 PM

శంషాబాద్ కాచారంలో పట్టుబడ్డ 11 కోట్ల వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. లిక్కర్ కేసు ఏ1 రాజ్ కేసిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు.

Raj KasiReddy

విజయవాడ: హైదరాబాద్‌ శంషాబాద్‌లోని కాచారంలో సిట్ (Special Investigation Team) జరిపిన తనిఖీల్లో పట్టుబడ్డ 11 కోట్ల వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న A1 రాజ్ కేసిరెడ్డి తనకు ఆ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల నగదుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఆ నగదు తనదిగా చిత్రీకరించి, తనకు బెయిల్ రాకుండా చేయడం కోసం సిట్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో విచారణ జరుగుతుండగా, సిట్ అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సిట్ వర్గాలు రాజ్ కేసిరెడ్డికి వ్యతిరేకంగా మరిన్ని ఆధారాలు సేకరిస్తుండగా, అతని బెయిల్ పిటిషన్‌పై కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది.

కాగా, ఏపీ లిక్కర్ స్కాం కేసులో A 40గా ఉన్న వరుణ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు హైదరాబాద్‌‌లో సోదాలు నిర్వహించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో A1 కేసిరెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, A12 చాణక్య రూ. 11 కోట్లని 12 అట్టపెట్టల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్‌లో కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్‌లో 11 కోట్లను దాచినట్లు చెప్పడంతో సిట్ అధికారులు తనిఖీలు చేసి అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

ఆ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

సింగపూర్‌ పర్యటన పూర్తి.. అమరావతికి బయలుదేరిన సీఎం చంద్రబాబు

For More Andhrapradesh News

Updated Date - Jul 30 , 2025 | 06:56 PM