AP Inter Results: ఇంటర్ ఫలితాలు నేడే
ABN, Publish Date - Apr 12 , 2025 | 04:47 AM
ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 13న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఫలితాలు వెబ్‌సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ నంబరులో చూడొచ్చు
ఉదయం 11 గంటలకు విడుదల: లోకేశ్
అమరావతి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలవుతాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా తెలిపారు. విద్యార్థులు resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చని సూచించారు. ఇంటర్ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేశ్ పేర్కొన్నారు.
Updated Date - Apr 12 , 2025 | 04:47 AM