AP ICET 2025: నేడు ఏపీ ఐసెట్ 94 కేంద్రాల్లో నిర్వహణ
ABN, Publish Date - May 07 , 2025 | 07:03 AM
ఏపీ ఐసెట్-2025 బుధవారం నిర్వహించనున్నారు. 37,572 మంది దరఖాస్తు చేసుకున్నారు, 94 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది
విశాఖపట్నం, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం బుధవారం ఐసెట్-2025 నిర్వహించనున్నట్టు సెట్ చైర్మన్, ఏయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ వెల్లడించారు. పరీక్షకు 37,572 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో 93 కేంద్రాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు చెప్పారు.
Updated Date - May 07 , 2025 | 07:03 AM