ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Ananthababu: డ్రైవర్ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టు ఝలక్

ABN, Publish Date - Jul 25 , 2025 | 04:38 PM

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

MLC Ananthababu

అమరావతి, జులై, 25: డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ కేసు పునర్విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టతనిచ్చింది. కాగా, ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో నిన్న సవాలు చేస్తు ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అనంతబాబు పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు.. స్టే కు నిరాకరించడంతో ఈ కేసు పునర్విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి.

ఇలా ఉండగా, ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం SIT ఏర్పాటు చేసింది. దీంతో SIT అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించిన వారిపై SIT ఫోకస్ పెట్టింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసే యోచనలో ఉంది. డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 06:12 PM