ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court : విచారణకు సహకరించండి

ABN, Publish Date - Jan 08 , 2025 | 05:29 AM

పల్నాడు జిల్లాలోని మాచర్లలోని టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టడంతో పాటు ఆ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని వైసీపీ నేత...

  • వైసీపీ నేత పిన్నెల్లికి హైకోర్టు ఆదేశం

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలోని మాచర్లలోని టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టడంతో పాటు ఆ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతి సెలవులు ముగిసేవరకు రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఈ నెల మూడోవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్‌ తరఫున సీనియన్‌ న్యాయవాది ఒ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ను అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన ఉందని, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ స్పందస్తూ.. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తే పోలీసు విచారణకు ఆటంకం కలుగుతుందన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 05:29 AM