Judge Transfer: జస్టిస్ మన్మథరావు బదిలీని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:10 AM
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు బదిలీని పునఃపరిశీలించాలని ఏపీ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. బదిలీ సిఫారసులను ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసింది
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు బదిలీని పునఃపరిశీలించాని ఏపీ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. బదిలీ సిఫారసులను ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ నెల 25న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చిదంబరం మంగళవారం పేర్కొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 05:10 AM