ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్

ABN, Publish Date - Mar 03 , 2025 | 05:52 PM

AP Govt : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ శాశ్వతంగా నిర్మూలించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనంది. వీటిని ఆక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయించింది.

AP Govt

అమరావతి, మార్చి 03: గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణ, వినియోగాన్ని అరికట్టేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉక్కు పాదం మోపింది. అలాంటి వేళ.. వీటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు సమాయత్తమైంది. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందుతోన్న సంక్షేమ పథకాలను కట్ చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ తరహా కఠిన చర్యలు తీసుకుంటే కానీ.. డ్రగ్స్, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను నిరోధించ వచ్చనే అభిప్రాయం కూటమిలోని వివిధ పార్టీల నేతల్లో వ్యక్తమైంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి వారు సూచించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. దాంతో కుటుంబంలో ఎవరైనా మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే.. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు నిలిపి వేయాలనే ఓ నిర్ణయానికి ప్రభుత్వం రానుంది. అయితే ఈ ప్రతిపాదనలు రానున్న కేబినెట్‌‌ సమావేశంలో ముందుకు వచ్చే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో వీటిని ఆమోదించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసే దిశగా అధికారులు సమాయత్తమవుతోన్నట్లు తెలుస్తోంది.

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్


గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా, డ్రగ్స్ వినియోగం పెచ్చురిల్లింది. ముఖ్యంగా కళాశాలు, పాఠశాల్లోని విద్యార్థులు సైతం వీటి వినియోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే..దేశంలో ఎక్కడ ఇవి పట్టుబడినా.. వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు వార్త కథనాలు సైతం వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. తమ బిడ్డల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..


గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి చాకెట్లు సైతం దుకాణాల్లో లభ్యమవుతోన్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో.. డ్రగ్స్, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపింది. అంతేకాదు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వందల ఎకరాల్లో అక్రమంగా సాగవుతోన్న గంజాయి పంటను సైతం పోలీసులు ధ్వంసం చేశారు.


మరోవైపు సోమవారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం.. గంజాయి అరికట్టడంపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. ఈగల్ టీమ్స్‌ సైతం రాష్ట్రంలో గంజాయి అక్రమరవాణాపై దృష్టి సారించాయని వివరించారు.


గంజాయికి విద్యార్థులు బానిసలు కాకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు చేపడుతున్నామని ఆమె స్పష్టం చేశారు. అయితే డ్రై లిక్విడ్ రూపంలో గంజాయి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 ఎకరాల్లో గంజాయి సాగవుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 08:42 PM