CM travel: సీఎంకు కొత్త హెలికాప్టర్ కొనుగోలుపై కమిటీ
ABN, Publish Date - May 14 , 2025 | 05:15 AM
ముఖ్యమంత్రి సహా ప్రముఖుల ప్రయాణాలకు వినియోగిస్తున్న హెలికాప్టర్ల సమీక్షకు నిపుణుల కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవసరమైతే కొత్త హెలికాప్టర్ మోడల్స్‌ను సూచించేందుకు ఈ కమిటీ పని చేస్తుంది.
అమరావతి, మే13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల ప్రయాణాల కోసం వినియోగంలో ఉన్న హెలికాప్టర్ పనితీరు సమీక్షించి మార్పు అవసరమైతే సరైన మోడల్స్‌ను సూచించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి(పొలిటికల్) చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్‌లోని డీజీసీఏ కార్యాలయ ప్రతినిధి సభ్యులు. ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ కన్వీనర్‌గా ఉంటారు. ఏపీ పోలీసు శాఖ, ఏవియేషన్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు కొత్త హెలికాప్టర్ కొనుగోలు ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 05:15 AM