ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Government: భారీగా బదిలీలు

ABN, Publish Date - Jan 21 , 2025 | 04:21 AM

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒకే రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది.

  • ఒకే రోజు 27 మంది ఐపీఎస్‌లు, 25 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం

  • సీఆర్‌డీఏ కమిషనర్‌గా కన్నబాబు

  • కాటమనేని భాస్కర్‌కు ఐటీ బాధ్యతలు

  • దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సన్నద్ధం!?

  • జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా ఎంకే మీనా

  • ఎక్స్‌ అఫిషియో ఎస్‌సీఎస్‌గా సాయిప్రసాద్‌

  • శాంతి భద్రతల ఏడీజీగా మధుసూదన్‌

  • హర్షవర్ధన్‌కు తిరుపతి జిల్లా బాధ్యతలు

  • పీఆర్‌బీ చైర్మన్‌గా మీనా, టెక్నికల్‌కు శ్రీకాంత్‌

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒకే రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. నిరీక్షణలో ఉన్న కొందరికి పోస్టింగులు ఇవ్వడంతోపాటు ఎక్కువ మందికి స్థాన చలనం కలిగించింది. తద్వారా పాలనలో మరింత వేగం పుంజుకునేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా 25 మంది ఐఏఎ్‌సలు, 27 మంది ఐపీఎ్‌సలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఏఎస్‌ల బదిలీ/అదనపు బాధ్యతలు ఇలా..

  • జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి. సాయిప్రసాద్‌కు సీఎంకి ఎక్స్‌ అఫిషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.

  • హౌసింగ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్‌ జైన్‌కు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

  • అగ్రికల్చర్‌ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్‌కు పశు సంవర్థక శాఖ, డెయిరీ డెవల్‌పమెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • హస్తకళలు, చేనేత ముఖ్య కార్యదర్శిగా ఉన్న కె. సునీతను పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజేస్‌ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.

  • ఎన్‌. యువరాజ్‌కు చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • జీఏడీలో ఉన్న వాణీమోహన్‌కు పురావస్తు శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు.

  • సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న పీయూ్‌షకుమార్‌ను ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీగా నియమించారు. ప్లానింగ్‌ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


  • ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముకేష్‌ కుమార్‌ మీనాను జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా నియమించారు. దీంతో పాటు ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • ఐ అండ్‌ ఐ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్‌. సురేశ్‌కుమార్‌ను మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

  • సెలవులో ఉన్న సౌరబ్‌ గౌర్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమించారు.

  • పాఠశాల విద్య సెక్రటరీ కోన శశిధర్‌కు ఉన్నత విద్యా శాఖ సెక్రటరీతోపాటు నైపుణ్యాభివృద్ధి సెక్రటరీగా అదనపు బాద్యతలిచ్చారు.

  • సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న కాటమనేని భాస్కర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఐటీ విభాగం సెక్రటరీగా నియమించారు. దీంతో పాటు ఆర్టీజీఎస్‌, గ్రామ, వార్డు సచివాలయాలు సెక్రటరీగా, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్‌గా అదనపు బాధ్యతలిచ్చాచారు.

  • పశు సంవర్థక శాఖ, డెయిరీ డెవల్‌పమెంట్‌ కార్యదర్శిగా ఉన్న ఎం.ఎం. నాయక్‌ను సోషల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా నియమిస్తూ, గిరిజన సంక్షేమ కార్యదర్శింగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • మైనింగ్‌ విభాగం డైరెక్టర్‌గా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ను మైనింగ్‌ సెక్రటరీగా నియమిస్తూ మైనింగ్‌ విభాగం డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • సాంఘిక సంక్షేమ విభాగం నుంచి బదిలీ అయిన కన్నబాబును సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించారు.

  • స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీగా ఉన్న శేషగిరి బాబును కార్మిక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు.

  • దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న ఎస్‌. సత్యనారాయణను బీసీ సంక్షేమ కార్యదర్శిగా నియమించి, ఈడబ్యూఎస్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • పర్యాటక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ను దేవదాయశాఖ సెకట్రరీగా నియమించారు. పర్యాటక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

  • సెర్ఫ్‌ సీఈవో జి.వీరపాండియన్‌ను ఆరోగ్యశాఖ కమిషనర్‌గా నియమించారు.

  • మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ హరినారాయణను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీగా బదిలీ చేశారు.

  • శాప్‌ ఎండీ గిరీషాను ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీగా నియమించారు. దీంతో పాటు శాప్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • సీపీడీసీఎల్‌ ఎండీగా ఉన్న పట్టణంశెట్టి రవిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోగా నియమించారు.

  • విశాఖపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ పి. సంపత్‌కుమార్‌ను మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌గా నియమించారు.

  • పాడేరు ఐటీడీఏ పీవోగా ఉన్నవి. అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు.


తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు

రాష్ట్రంలో 27 మంది ఐపీఎస్‌ అధికారులు సోమవారం బదిలీ అయ్యారు. శాంతి భద్రతల ఏడీజీగా ఎన్‌.మధుసూదన్‌రెడ్డికి కీలక పోస్టింగ్‌ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చూసిన శ్రీకాంత్‌ను సాంకేతిక సేవలకు బదిలీ చేసింది. ఇక, పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్న పాలరాజును ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా పంపారు. డీఐజీలు సత్య యేసుబాబు, అట్టాడ బాబూజీ, ఫక్కీరప్పను ప్రాధాన్యంలేని పోస్టుల్లో నియమించారు. సీబీఐ నుంచి తిరిగొచ్చిన ఆర్‌. జయలక్ష్మికి ఏసీబీ బాధ్యతలిచ్చారు. అలాగే, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌రాజును, కడప జిల్లా ఎస్పీగా అశోక్‌ కుమార్‌ గౌడ్‌, కర్నూలు ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌ను నియమించారు. గరికపాటి బిందుమాధవ్‌ను కాకినాడకు బదిలీ చేశారు. అయితే, ‘వైపీఎస్‌’ అధికారులుగా పేరొంది, గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు కొమ్ము కాసిన కొల్లి రఘురామిరెడ్డి, రిశాంత్‌రెడ్డి, జాషువా, రవిశంకర్‌ రెడ్డిలకు ఎలాంటి పోస్టింగులూ దక్కలేదు.

దీర్ఘకాలిక సెలవుపై కాటమనేని

సీఆర్‌డీఏ కమిషనర్‌ పోస్టు నుంచి బదిలీ అయిన కాటమనేని భాస్కర్‌ దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన కమిషనర్‌ అయినప్పటి నుంచి మంత్రి నారాయణతో పొసగడం లేదు. నిత్యం ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. వీరిద్దరి పంచాయతీ సీఎం చంద్రబాబు వరకూ వెళ్లింది. దీంతో మంత్రి నారాయణ కమిషనర్‌ను తప్పించాలని పట్టుబట్టారు. సీఎం కూడా ఇద్దరికీ నచ్చజెప్పి కొంత కాలం పరిస్థితిని పరిశీలించారు. కానీ, ఎలాంటి మార్పు రాకపోవడంతో కమిషనర్‌ భాస్కర్‌ను బదిలీ చేశారు. తన బదిలీ అనివార్యమని ముందే ఊహించిన భాస్కర్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం కీలకమైన ఐటీ శాఖ ఇచ్చినప్పటికీ ఆయన అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 21 , 2025 | 04:27 AM