సౌర విద్యుత్ ఉత్పత్తికి హబ్‌గా ఏపీ: చంద్రబాబు
ABN, Publish Date - May 27 , 2025 | 05:30 AM
ఏపీ సౌర విద్యుత్ ఉత్పత్తిలో హబ్‌గా మారుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్య సాధనకు ప్రభుత్వం సమగ్రమైన పాలసీతో ముందుకొస్తోంది.
అమరావతి, మే26(ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్ విషయంలో 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్య సాధనకు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాల అభివృద్ధిపై మన దేశం దృష్టి పెట్టిందని సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సోలార్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సమగ్రమైన పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే ఇది ఫలితాలు ఇస్తోందన్నారు. దేశంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తికి హబ్‌గా ఏపీ మారుతోందని పేర్కొన్నారు. మరింత మంది సోలార్ ఉత్పత్తిదారులను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దేశం హరిత ఇంధనంవైపు మారుతున్న క్రమంలో కీలకంగా మారుతున్నామన్నారు. అదే సమయంలో మన వాళ్ల కోసం లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తున్నామని చెప్పారు.
Updated Date - May 27 , 2025 | 05:30 AM