ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Singapore Tour: సింగపూర్ దేశాధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Jul 29 , 2025 | 08:40 PM

సింగపూర్‌లో సీఎం చంద్రబాబుతోపాటు ఆయన ప్రతినిధి బృందం మూడో రోజు పర్యటించింది. ఆ దేశ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు.

సింగపూర్, జులై 29: సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో సింగపూర్ పెట్టుబడులు, వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ఈ భేటీలో వీరిద్దరూ విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, ముఖ్యంగా డిజిటల్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ఉన్న అపారమైన అవకాశాలను సింగపూర్ అధ్యక్షుడికి వివరించారు చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల సానుకూల వాతావరణం, నూతన పారిశ్రామిక విధానాలను తెలిపారు. ఏపీలో సింగపూర్ సంస్థలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇరు ప్రాంతాలు లబ్ధి పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం ఏపీతో గత భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని అందించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ భేటీ ద్వారా ఏపీ, సింగపూర్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

పలు కంపెనీల సీఈవోలతో సీఎం భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖపట్నంలో అందుకు అవసరమైన ఎకో సిస్టమ్ సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చంద్రబాబు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ఈ సందర్భంగా వారికి వివరించారు. త్వరలో గూగుల్ డేటా సెంటర్ సైతం విశాఖపట్నం వేదికగా ఏర్పాటు కానుందని తెలిపారు.

అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖపట్నంలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని సోదాహరణగా వివరించారు. దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలు పొందటంతోపాటు పరిశోధనలకూ ఆస్కారం ఉందని ఆ దేశ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కిపైగా పాలసీలు అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక విధానాలతోపాటు పెట్టుబడులకు ఉన్న అన్ని అవకాశాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా వారికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై.. తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు.

లాజిస్టిక్ కారిడార్‌గా కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం: సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా స్థానిక జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ తీర ప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక - లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పోర్టులను అనుసంధానం చేయడంతోపాటు వీటికి సమీపంలో ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్‌ను సీఎం చంద్రబాబుతోపాటు మంత్రుల బృందం సందర్శించింది.

ఈ ఐల్యాండ్ వేదికగా సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో సమీకృత పెట్రో కెమికల్ ప్లాంట్, ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం అందిస్తున్న సేవలను సింగపూర్ ఉన్నతాధికారులు సీఎం బృందానికి సోదాహరణగా వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం చేసిన ప్రణాళికలు, వివిధ యుటిలిటీ మోడల్స్‌తోపాటు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను చూపించారు. పెట్రో కెమికల్ కేంద్రంలో ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతోపాటు ఇతర ఉత్పత్తులైన పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్‌ను వారికి వివరించారు.

మొత్తం 3 వేల హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పెట్రో కెమికల్ హబ్‌ను ఏర్పాటు చేసినట్టు జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్ ఉన్నతాధికారులు వివరించారు. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినట్టు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్‌తోపాటు సమీకృత భద్రతా వ్యవస్థలనూ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు కూడా గ్లోబల్ పార్టనర్‌లుగా కలిసి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. పెట్రో కెమికల్ ఐల్యాండ్ సందర్శనకు విచ్చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రతినిధి బృందానికి ఆ సంస్థ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 29 , 2025 | 09:46 PM