Ayyanna Patrudu : అసెంబ్లీ ఫైనాన్స్ కమిటీలకు చైర్మన్లు ఖరారు
ABN, Publish Date - Feb 05 , 2025 | 06:01 AM
మూడు ఆర్థిక కమిటీలకు చైర్మన్లను ఖరారు చేస్తూ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు.
పీఏసీకి పులపర్తి, పీఎ్‌సయూసీకి కూన, ఎస్టిమేట్స్‌కు వేగుళ్ల
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు ఆర్థిక కమిటీలకు చైర్మన్లను ఖరారు చేస్తూ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. జనసేనకు చెందిన పులపర్తి రామాంజనేయులు ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) చైర్మన్‌గా నియమితులుకాగా... టీడీపీకి చెందిన కూన రవికుమార్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పీఎస్‌యూసీ) చైర్మన్‌గా, అదే పార్టీకి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. మంగళవారం ఈమేరకు నోటిఫికేషన్ విడుదలైంది. శాసనసభలో వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో పీఏసీ అధికార పార్టీ ఖాతాలో పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 06:04 AM