Andhra Pradesh weather: మరో మూడు రోజులు వర్షాలు
ABN, Publish Date - May 31 , 2025 | 04:46 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. బంగాళాఖాతంలో అలల ఉధృతితో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకండని హెచ్చరిక జారీ చేశారు.
పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు
అమరావతి, విశాఖపట్నం, మే30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శనివారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరుగా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఎండతీవ్రత, ఉక్కపోత కొనసాగింది. దీనికితోడు సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీశాయి. దీంతో మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల మేఘాలు ఆవరించి పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా గుర్ల, కడప జిల్లా శెట్టివారిపల్లిలో 87.5, విజయనగరం జిల్లా వేపాడలో 79.2, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74 మిల్లీమీటర్ల వాన పడింది. బంగాళాఖాతంలో అలల ఉధృతి కొనసాగడం, కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండడంతో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ శాఖ సూచించింది.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 04:46 AM