ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

ABN, Publish Date - May 11 , 2025 | 05:51 AM

హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్‌ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర వ్యాజ్యాల విచారణ కోసం వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి.

  • వెకేషన్‌ కోర్టుల విచారణ తేదీల ఖరారు

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్‌ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్‌ 16 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి. ఇందులో భాగంగా మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేష్ రెడ్డి, జస్టిస్‌ వై.లక్ష్మణరావు డివిజన్‌ బెంచ్‌గా జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ సింగిల్‌ బెంచ్‌గా విచారణలు చేయనున్నారు. మే 29న జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌, జస్టిస్‌ వై.లక్ష్మణరావు డివిజన్‌ బెంచ్‌గా జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ సింగిల్‌ బెంచ్‌గా కేసులు విచారించనున్నారు. రెండోదశ వెకేషన్‌ కోర్టులు జూన్‌ 5, 12వ తేదీల్లో విచారణ చేపడతాయి. జూన్‌ 5, 12వ తేదీల్లో జస్టిస్‌ జస్టిస్‌ ఎం.కిరణ్మయి, జస్టిస్‌ టి.సి.డి.శేఖర్‌ డివిజన్‌ బెంచ్‌, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు సింగిల్‌ బెంచ్‌ నిర్వహిస్తారు.

Updated Date - May 11 , 2025 | 05:52 AM