Krishna River: 4 టీఎంసీలు ఎందుకూ చాలవు
ABN, Publish Date - May 27 , 2025 | 06:06 AM
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నాలుగు టీఎంసీల కృష్ణా జలాలు పూర్తిగా అందడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జలాలు విడుదలలో ఆలస్యం ఉంటే నీటి సంవత్సరం ముగిసిపోతుంది కావున తక్షణమే జలాలు విడుదల చేయాలని ఈఎన్‌సీ నరసింహమూర్తి కోరారు.
దాహార్తి తీర్చడానికి మరో నాలుగు కేటాయించండి.. కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నాలుగు టీఎంసీల కృష్ణా జలాలు ఎందుకూ చాలవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో నాలుగు టీఎంసీలు కేటాయించాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ)కి ఈఎన్‌సీ నరసింహమూర్తి లేఖ రాశారు. ‘ఈ నెల 21న తెలంగాణకు 10 టీఎంసీలు, ఏపీకి నాలుగు టీఎంసీలు విడుదల చేస్తూ కేఆర్‌ఎంబీ ఆదేశాలు ఇచ్చింది. ఈ జలాలు చివరిదాకా ప్రవహించడం లేదు. కొంత భూమిలోకి ఇంకిపోతోంది. మరికొంత మధ్యలోనే ఆవిరైపోతోంది. కృష్ణా ఆయకట్టు ప్రజల గొంతు తడవడం లేదు. శ్రీశైలం జలాశయంలో ఈ నెల 19 నుంచి 2.32 టీఎంసీల జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీకి ఇంకా 5.662 టీఎంసీలు రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా వాటిని విడుదల చేయాలి. ఆలోగా జలాలు విడుదల కాకుంటే ఈ నెలాఖరుతో నీటి సంవత్సరం ముగుస్తున్నందున మేమిచ్చిన ఇండెంట్ మురిగిపోతుంది. కావున నాలుగు టీఎంసీల జలాలను తక్షణమే విడుదల చేయండి’ అని ఈఎన్‌సీ కోరారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 06:06 AM