ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh universities: పరిశోధన ప్రగతి నామమాత్రం

ABN, Publish Date - May 27 , 2025 | 05:42 AM

రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య వర్సిటీలకు రెగ్యులర్‌ వీసీలు లేక పాలన అస్తవ్యస్తమైంది. పరిశోధన, ప్రగతి క్షీణించి, రాజకీయల ఆధిపత్యంతో వర్సిటీలు నామమాత్రంగా మారిపోయాయి.

ఇన్‌చార్జుల పాలనలో అగ్రి అనుబంధ వర్సిటీలు సతమతం

రాజకీయాలు, ఆధిపత్య పోరుతో మసకబారిన ప్రతిష్ఠ

అవకాశవాదులకు అడ్డాలుగా మారిన వైనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య విశ్వవిద్యాలయాలు వెలవెలబోతున్నాయి. రాజకీయాలు, ఆధిపత్య పోరుతో వాటి ప్రతిష్ఠ మసకబారుతోంది. ఇన్‌చార్జి వీసీలు, అధికార వ్యవస్థతో పాలన అస్తవ్యస్తంగా మారింది. అవకాశవాదులకు ఈ వర్సిటీలు అడ్డాగా మారాయి. నాలుగు వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. పరిశోధన ప్రగతి లోపిస్తోంది. కనీసం కేంద్ర ప్రాయోజిత పథకాలను ఉపయోగించుకుని, మంచి ఫలితాలు సాధించాల్సిన వర్సిటీలు నామమాత్రంగా నడుస్తున్నాయి. వీటికి గత రెండేళ్లుగా రెగ్యులర్‌ వీసీలు లేరు. ఇన్‌చార్జులతోనే నడిపించేస్తున్నారు. ఈ వర్సిటీల్లోని కీలక విభాగాలకూ ఇన్‌చార్జి అధికారులనే కొనసాగిస్తున్నారు. వర్సిటీలకు డైనమిక్‌ వీసీలు, రెగ్యులర్‌ అధికారులు ఉంటే.. వారి దర్శకత్వంలో పని చేస్తే.. శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తారన్న వాదన ఉంది. అయితే, ఎప్పుడో సాధించిన ప్రగతిని చెప్పుకుంటూ వర్సిటీలు కాలక్షేపం చేస్తున్నాయి. వ్యవసాయ పరిశోధనల్లో అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసీఏఆర్‌) ఏటా ఇచ్చే ర్యాంకుల్లో రాష్ట్రంలోని ఈ నాలుగు వర్సిటీలు చాలా కాలంగా మొదటి 10 ర్యాంకుల్లో నిలిచిన దాఖలాల్లేవు. సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ ఒక్కటీ లేదు. ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీలు కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులను విరివిగా అమలు చేస్తున్నాయి. మన వర్సిటీలు మాత్రం ఇందుకు భిన్నం. ఏ ప్రాజెక్టూ పూర్తి ఫలితాలిచ్చిన దాఖలా లేదు. ముఖ్యంగా ఇంక్యుబేషన్‌ సెంటర్‌, ఇన్నోవేషన్‌ సెంటర్‌ వంటివి రాష్ట్రంలోని వర్సిటీల్లో లేవు. ఇతర రాష్ట్రాల్లో 2-3 జిల్లాలకు ఒక వర్సిటీ ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు వేర్వేరుగా ఉండటంతో రైతులకు పూర్తి స్థాయిలో మెరుగైన సేవలు అందడం లేదు. మిర్చి పంటను రెండు వర్సిటీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఐసీఏఆర్‌ నిధులు 100ు ఉన్న కేవీకేలకు తగిన సిబ్బందిని నియమించుకోలేకపోతున్నారు. ఒక వేళ ఎవరినైనా నియమిస్తే.. లంచాలు తీసుకుని, అనర్హులకు పోస్టులిస్తున్నారు. కేవీకేల్లో 70ు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీసీలు చేసే తప్పులకు మద్దతు పలకడం తప్ప.. యూజీసీ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎలాగైనా జీతం వస్తుందన్న ఉద్ధేశంతో కొందరు ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టి, ఇతర వ్యాపకాలు పెట్టుకుంటున్నారన్న విమర్శ ఉంది. సుకుంది.


ఉద్యాన వర్సిటీ 2011 నుంచి ఇన్‌చార్జులే

పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం వద్ద డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీని 2007లో స్థాపించారు. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్‌ వీసీలు ముగ్గురు మాత్రమే పని చేశారు. మిగతా కాలమంతా ఇన్‌చార్జులతోనే నడిపించారు. 2011 తర్వాత అంతా ఇన్‌చార్జుల పాలనే. వీసీలుగా వ్యవహరించే వారు వారికి నచ్చిన వారిని కీలక పోస్టుల్లో నియమించుకుంటున్నారు. ఉద్యాన పంటల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు.. ఉద్యాన వర్సిటీలో ఫామ్‌ మెకనైజేషన్‌కు అవకాశం ఉన్నా.. ఆ దిశగా పరిశోధనల ఊసే లేదు.

వెటర్నరీ వర్సిటీలో ఇష్టారాజ్యం

2006లో తిరుపతిలో ఏర్పాటైన శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కూడా నామమాత్రపు సేవలతోనే నడుస్తోంది. దీనిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బోగస్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారన్న ఫిర్యాదులపైనా, దొడ్డిదారి పదోన్నతులపైనా చర్యలు కొరవడ్డాయి. ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న వారు వర్సిటీ నిధుల్ని తమకు నచ్చినట్లు కేటాయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆర్టీఐ చట్టం కింద సమాచారం అడిగినా వర్సిటీ అధికారులు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి.


సొంత భవనాలు లేని ఫిషరీస్‌ వర్సిటీ

ఏపీ ఫిషరీస్‌ వర్సిటీకి మత్స్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా, ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్నారు. ఒక ప్రొఫెసర్‌ నాలుగు పోస్టులు, మరో ప్రొఫెసర్‌ రెండు పోస్టులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇన్‌చార్జి వీసీ, ఇన్‌చార్జి అధికారులతోనే వర్సిటీని నడిపిస్తున్నారు. సొంత భవనాలు కూడా లేకుండా అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు.

రంగా వర్సిటీలో ఆధిపత్య పోరు..

60ఏళ్ల చరిత్ర ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక వర్గపోరు, రాజకీయాలకు నిలయంగా మారిందన్న విమర్శలున్నాయి. తమకు అనుకూల ప్రభుత్వం వచ్చినప్పుడు ఆధిపత్యం చెలాయిస్తూ తోటి వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ వర్సిటీకి రెండేళ్ల నుంచి సీనియర్‌ శాస్త్రవేత్తనే ఇన్‌చార్జి వీసీగా కొనసాగిస్తున్నారు. వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ కోర్సులకు సకాలంలో సీట్లు భర్తీ కాక పదేపదే కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో దొడ్డిదారిన పదోన్నతులు పొందిన శాస్త్రవేత్తలపై ప్రస్తుత ప్రభుత్వం తాజాగా చర్యలు తీ


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:43 AM