ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati Development: అమరావతిలో మళ్లీ భూసమీకరణ

ABN, Publish Date - Jun 25 , 2025 | 04:26 AM

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసం, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ భూ సమీకరణ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

విశాఖలో కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాలు

ఎకరా 99 పైసలకే కేటాయింపు

బర్లీ పొగాకుకు వచ్చే ఏడాది క్రాప్‌ హాలిడే

శ్రీశైలం, ధవళేశ్వరం మరమ్మతులకు నిధులు

గండికోటలో రిసార్టుకు 50 ఎకరాలు

50 చ.మీ. ఇంటి నిర్మాణ అనుమతికి రూపాయే.. క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు

  • ల్యాండ్‌ పూలింగ్‌కు మంత్రిమండలి ఆమోదం

  • విశాఖలో కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాలు

  • శ్రీశైలం, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.350 కోట్లు

  • క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసం, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ భూ సమీకరణ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఒకేరకమైన రూల్స్‌తో ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని నిశ్చయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశమైంది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార- పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారఽథి విలేకరులకు తెలిపారు. ఏడాది పాలనలో 26 మంత్రిమండలి సమావేశాలు జరిగాయని.. ప్రతి 15 రోజులకొకటి నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం.. ఆ సీఎంకు ఇష్టం వచ్చినప్పుడు క్యాబినెట్‌ భేటీలు, ఆయనకు ఇష్టం వచ్చిన అంశాలనే మంత్రివర్గంలో పెట్టేవారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం 10 సెంట్ల నుంచి వేల ఎకరాల భూములు కేటాయించే అంశాల వరకు మంత్రిమండలిలో ప్రజాస్వామ్యయుతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ ‘కాగ్నిజెంట్‌’కు విశాఖ జిల్లా మధురవాడలో 22.19 ఎకరాలను ఎకరా 99 పైసలకు కేటాయించేందుకు తెలిపిందన్నారు. ఈ సంస్థ రూ.1,582.98 కోట్ల పెట్టుబడి పెడుతుందని.. 8 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. శ్రీశైలం జలాశయం, ధవళేశ్వరం ఆనకట్ట మరమ్మతులకు రూ.350 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్‌ అంగీకరించిందన్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫారసులకు ఆమోదముద్ర వేసిందని.. రూ.28,546 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఓకే చేసిందని.. వాటి ద్వారా 30,270 ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.

మరిన్ని నిర్ణయాలివీ..

జూ పొగాకు రైతులను రక్షించడానికి ఏపీ మార్క్‌ఫెడ్‌ ఇంటెర్వెన్షన్‌ పద్ధతి ద్వారా మొదటి దశలో 20 మిలియన్‌ కిలోల హెచ్‌డీబీఆర్‌జీ పొగాకును సేకరించడానికి ఆమోదం. రూ.273.17 కోట్లు మంజూరు.

  • వచ్చే ఏడాది బర్లీ పొగాకుకు క్రాప్‌ హాలిడే.

  • 6,497 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రెడేషన్‌.

  • అమరావతి క్యాపిటల్‌ సిటీలో ‘రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్‌ , ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్‌లు, పునరుపయోగ నీటి పైపు లైన్లు, అవెన్యూ ప్లాంటేషన్‌’ పనులకు రూ.1,052.67 కోట్లతో పరిపాలనా ఆమోదం.

  • రాజధాని ఈ-3 రోడ్డును ఎన్‌హెచ్‌-16కి అనుసంధానించడానికి రూ.682.99 కోట్లతో టెండర్లు

  • అమరావతి ప్రభుత్వ కాంప్లెక్సులో జీఏడీ, హెచ్‌వోడీ టవర్ల పనుల ఎల్‌-1 బిడ్ల ఆమోదం.

  • మున్సిపల్‌ శాఖలో 40 టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల మంజూరు/అ్‌పగ్రెడేషన్‌.

  • ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐయూఎల్‌ఈఆర్‌)కు భూమి కేటాయింపు ధర పద్థతి సవరణ.

  • 7 కొత్త అన్న క్యాంటీన్లు, కుప్పం, హైకోర్టులో ఇప్పటికే నిర్వహిస్తున్న 2 అన్న క్యాంటీన్లకు ఆమోదం.

  • భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం భవన, లేఅవుట్‌ నిబంధనల్లో మార్పులు.

  • అంతర్జాతీయ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ సాయి మైనేనికి డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం.

  • తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్‌వీపురంలో 12.70 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.

  • నెల్లూరు జిల్లా నేలటూరులో 5.04 ఎకరాలు సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు బదిలీ.

  • కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి.. గండికోట వద్ద ఓబెరాయ్‌ (విల్లాస్‌) రిసార్ట్‌ అభివృద్థి కోసం ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.

  • టెండర్లలో బ్లాక్‌ పీరియడ్‌ అనుభవం ఐదేళ్ల నుంచి పదేళ్లకు సవరణ.

  • సీఎం నియోజకవర్గం కుప్పంలో 17 చెక్‌ డ్యామ్‌లు, చెరువుల మరమ్మతుకు రూ.10.24 కోట్లు.

  • కడపలో అదానీ స్థాపిస్తున్న పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కేంద్రం సామర్థ్యం

  • కొప్పోలు(కొండాపురం, కడప)లో 360 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ స్థాపనకు చింతా గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు అనుమతి.

  • విజయవాడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌.. సాంస్కృతిక శాఖకు బదిలీ.

  • అమరావతిలో 4-స్టార్‌ లగ్జరీ హోటల్‌ అభివృద్థి కోసం గ్రీన్‌ పార్క్‌ హోటల్స్‌, రిసార్ట్స్‌ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు అందించడానికి ఆమోదం.

  • పోలవరంలో 5-స్టార్‌ లగ్జరీ రిసార్ట్‌ అభివృద్థి కోసం మెగ్లాన్‌ లేజర్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఎల్‌ఎల్‌పీ)కి భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు.

  • తిరుపతిలో 5-స్టార్‌ హోటల్‌ అభివృద్థి కోసం పావని హోటల్స్‌కు ప్రోత్సాహకాలు.

  • ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ , కల్యాణి స్ర్టాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, బీపీసీఎల్‌, ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థలకు మరిన్ని రాయితీలు.

  • స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ ఫౌండేషన్‌(ఎ్‌సఏపీపీఎఫ్‌).. స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్‌గా పునరుద్థరణ.

Updated Date - Jun 25 , 2025 | 04:26 AM