ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PACKETS: వామ్మో.. మూటలు..!

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:37 PM

మండలంలోని ఎర్రంపల్లి వద్ద సోమవారం దుర్వాసన వెదజల్లుతూ రైల్వేట్రాక్‌ పక్కన, వంతెన కింద పడి ఉన్న మూటలు కలకలం రేపాయి. రైల్వే, స్థానిక పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఎర్రంపల్లి సమీపంలోని రైల్వేట్రాక్‌ పక్కన మూడుచోట్ల వేర్వేరుగా ప్లాస్టిక్‌ సంచి మూటలు పడి ఉన్నాయి.ఒక్కో మూట మధ్య అర కిలోమీటరు మేర దూరం ఉంది.

Ramagiri CI Sridhar and staff are investigating.

రైల్వేట్రాక్‌ పక్కన వెలుగులోకి..

ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు

మేకల కళేబరాలు బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న వైనం

చెన్నేకొత్తపల్లి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రంపల్లి వద్ద సోమవారం దుర్వాసన వెదజల్లుతూ రైల్వేట్రాక్‌ పక్కన, వంతెన కింద పడి ఉన్న మూటలు కలకలం రేపాయి. రైల్వే, స్థానిక పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఎర్రంపల్లి సమీపంలోని రైల్వేట్రాక్‌ పక్కన మూడుచోట్ల వేర్వేరుగా ప్లాస్టిక్‌ సంచి మూటలు పడి ఉన్నాయి.ఒక్కో మూట మధ్య అర కిలోమీటరు మేర దూరం ఉంది. రైతులు.. తోటల వద్దకు వెళ్తుండగా దుర్వాసన వచ్చింది. దగ్గరికి వెళ్లి చూడగా ప్లాస్టిక్‌ సంచితో కూడిన మూటలు పడి ఉన్నాయి. రైల్వే వంతెన కింద ఒకటి, మిగిలిన రెండు మూటలు దూరదూరంగా ట్రాక్‌ పక్కన గుంతలో పడేశారు. అనుమానం వచ్చి రైల్వే, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ధర్మవరం రైల్వే సీఐ అశోక్‌కుమార్‌, రామగిరి సీఐ శ్రీధర్‌ అక్కడికి చేరుకుని, మూటలను పరిశీలించారు. అనంతరం ఒక్కొక్కటిగా మూటలను తెరిపించగా కుళ్లిపోయి పురుగులు పట్టిన మేకలు, వాటి పిల్లల కళేబరాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యాధులు సోకి మృతిచెందిన వాటిని గుర్తుతెలియని కాపరులు సంచుల్లో మూట కట్టి ఇక్కడ పడేసి ఉంటారని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 17 , 2025 | 11:37 PM