ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revenue Department పరిపాలనలో రెవెన్యూశాఖది పెద్దన్న పాత్ర

ABN, Publish Date - Jun 21 , 2025 | 01:49 AM

పరిపాలనలో రెవెన్యూ శాఖ పెద్దన్న పాత్ర పోషిస్తోందని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో శుక్రవారం రాత్రి రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ శివ్‌నారాయణ్‌శర్మ, డీఆర్వో మలోల పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్‌ను కట్‌ చేశారు.

- కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ - కలెక్టరేట్‌లో ఘనంగా రెవెన్యూ దినోత్సవాలు

అనంతపురం కలెక్టరేట్‌,జూన20(ఆంధ్రజ్యోతి): పరిపాలనలో రెవెన్యూ శాఖ పెద్దన్న పాత్ర పోషిస్తోందని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో శుక్రవారం రాత్రి రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ శివ్‌నారాయణ్‌శర్మ, డీఆర్వో మలోల పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్‌ను కట్‌ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... పరిపాలనలో రెవెన్యూ శాఖ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పాలన సమర్థవంతంగా నిర్వహించడంలో రెవెన్యూ శాఖ కీలకమన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జేసీ మాట్లాడుతూ... తాను ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో రెవెన్యూ సేవలను మరింత బాగా అందించాలన్నారు. అనంతరం ఆర్డీఓ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, విశ్రాంత రెవెన్యూ అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి రామకృష్ణారెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన, తిప్పేనాయక్‌, మల్లికార్జున, ఆనంద్‌, ఆర్డీఓ కేశవనాయుడు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌లు యుగేశ్వరిదేవి, వసంతలత, రియాజుద్దీన, ఏపీఆర్‌ఎ్‌సఏ అధ్యక్షుడు నాగ దివాకర్‌రావు, ఏపీజేఏసీ మహిళా ఛైర్మన సురేఖారావు, రెవెన్యూ స్పోర్ట్స్‌ అధ్యక్షుడు సంజీవరెడ్డి, రెవెన్యూ సొసైటీ ట్రెజరర్‌ సంజీవరాయుడు, కలెక్టరేట్‌ రెవెన్యూ ప్రెసిడెంట్‌ హరిప్రసాద్‌, ఏఓ అలెగ్జాండర్‌, తహసీల్దార్‌లు శ్రీధర్‌మూర్తి, బాలాజీ, రజాక్‌వలి, ఈశ్వరయ్యశెట్టి, రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jun 21 , 2025 | 01:49 AM