ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Borugadda Anil: అనంత కోర్టు వద్ద బోరుగడ్డ సంచలన కామెంట్స్

ABN, Publish Date - Apr 22 , 2025 | 03:24 PM

Borugadda Anil: బెయిల్ కోసం ఎలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదని బోరుగడ్డ అనిల్ స్ఫష్టం చేశారు. డాక్టర్ రాఘవ శర్మ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇచ్చారని.. దీనిపై కోర్టుకు వెళ్లి ప్రూఫ్ చేసుకుంటానని తెలిపారు.

Borugadda Anil

అనంతపురం, ఏప్రిల్ 22: వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను (Borugadda Anil) పోలీసులు అనంతపురం కోర్టులో హాజరుపర్చారు. అనంతపురం నగరంలోని మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బోరుగడ్డపై కేసు నమోదు అయ్యింది. 2018లో రామచంద్రనగర్‌లోని చర్చ్ స్థలం వివాదంలో సీఐ మురళీకృష్ణను బెదిరించాడంటూ అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చర్చ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై తన వర్గానికి సహకరించాలంటూ అప్పటి త్రీటౌన్ సీఐ మురళీ కృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీఐ మురళీ కృష్ణ సహకరించడం లేదంటూ ఆయనకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడు బోరుగడ్డ అనిల్.


ఆ బెదిరింపులకు సంబంధించి 2018లో త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్‌పై ఉన్న అనిల్ వాయిదాలకు హాజరుకాకపోవడంతో అనంతపురం మొబైల్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను పీటి వారెంట్‌తో అనంతపురం పోలీసులు ఈనెల 4న తీసుకువచ్చి అనంత కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు విచారణలో భాగంగా వాయిదా కోసం బోరుగడ్డను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం కోర్టుకు తీసుకువచ్చారు.

UPSC Results 2025: సివిల్స్‌ ఫలితాలొచ్చేశాయ్.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు..


ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ కోర్టు వద్ద మాట్లాడుతూ.. బెయిల్ కోసం ఎలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదని స్ఫష్టం చేశారు. డాక్టర్ రాఘవ శర్మ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇచ్చారని.. దీనిపై కోర్టుకు వెళ్లి ప్రూవ్ చేసుకుంటానని తెలిపారు. సీసీ కెమెరాకు కూడా తీపిస్తామని.. అవసరమైతే గూగుల్ టేక్ అవుట్‌ కూడా బయటకు తీసుకువస్తానని అన్నారు. దీని కోసం ఎంత దూరమైనా వెళ్తామని బోరుగడ్డ అనిల్ స్పష్టం చేశారు. అలాగే తాను ఇప్పటికే 30 కేజీల వరకు బరువు తగ్గినట్లు మీడియాతో బోరుగడ్డ తెలిపారు. ప్రస్తుతం అనంత కోర్టు హాజరుపరిచిన పోలీసులు తిరిగి బోరుగడ్డను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

JD Vance Jaipur Tour: అంబర్‌ కోటను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 05:40 PM