NTR Link Amaravati: మే 2 ప్రత్యేకం
ABN, Publish Date - May 04 , 2025 | 05:50 AM
ఎన్టీఆర్ పెళ్లి రోజు అయిన మే 2నే అమరావతి పనులు పునఃప్రారంభం కావడం విశేషంగా మారింది. ఈ యాదృచ్ఛికతను టీడీపీ అభిమానులు సాంఘిక మాధ్యమాల్లో వేడుకలా జరుపుకుంటున్నారు
యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ పెళ్లి రోజునే అమరావతి పనుల పునఃప్రారంభ వేడుక
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): అమరావతి పనులు పునఃప్రారంభించిన మే 2వ తేదీనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పెళ్లి రోజు కావడం విశేషం. 1942, మే 2న ఎన్టీఆర్ వివాహం కృష్ణా జిల్లా కొమరవోలులో బసవతారకంతో జరిగింది. 83 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజు అమరావతి విధ్వంసం నుంచి వికాసం దిశగా అడుగులు వేయడానికి ముహుర్తం నిర్ణయించడం యాదృచ్ఛికం. ఈ విషయాన్ని టీడీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
Updated Date - May 04 , 2025 | 05:50 AM