MLC Elections Result: తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఇవి గమనించారా.. విస్తుపోయే వాస్తవాలు
ABN, Publish Date - Mar 04 , 2025 | 07:28 PM
MLC Elections Result: తాాజాగా జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తన సత్తా చాటింది. గత 8 నెలల చంద్రబాబు పాలనకు ఈ ఫలితాలు అద్దం పడుతోన్నాయి. అంతేకాదు.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ నమోదైన ఓట్ల షేర్ కంటే.. ఈ ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల షేర్ భారీగా పెరిగింది.
అమరావతి, మార్చి 04: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తన సత్తా చాటింది. కూటమి మద్దతు ఇచ్చిన అన్ని స్థానాల్లో ఆ యా అభ్యర్థులు విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు 65 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. సాధారణ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్డాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. వాటి అనంతరం రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు.. వీటిలో సైతం కూటమి ఘన విజయం సాధించింది. కూటమి అధికారం చేపట్టి.. జస్ట్ ఎనిమిది నెలల తర్వాత వచ్చన ఈ ఎన్నికల్లో ప్రజలు ఏక పక్ష తీర్పు ఇవ్వడం ద్వారా చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు అయింది.
Also Read: ఏటీఎంలో చోరీ యత్నం.. బిగ్ ట్విస్ట్
టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన రెండు స్థానాల్లో వారు తిరుగులేని మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో 8 నెలల పాలనను దీవించేలా తీర్పు వచ్చిందనే ఓ చర్చ సైతం సాగుతోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో 57 శాతం ఓట్ షేర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. నేడు అంతకు మించి అంటే.. 65 శాతంపైగా ఓట్ షేర్‌తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం లభించింది.
Also Read: ముందుల ధరల పెరుగుదల.. సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు
ఉమ్మడి కృష్ణా - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు1,45,057 ఓట్లు పోలవడం ద్వారా మొత్తం ఓట్లలో 67.51 శాతానికి పైగా సాధించారు. ఇంకా చెప్పాలంటే.. 82,320 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించారు. ఇక ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి తరఫున బరిలో నిలిచిన పేరాబత్తుల రాజశేఖర్ 1,24,702 ఓట్లు పొందారు. అంటే మొత్తం ఓట్లలో 62.59% పైగా ఆయన సాధించారు. ఇంకా చెప్పాలంటే..77,4610 ఓట్లపైగా పోలై.. భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
Also Read: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 59.28 శాతం ఓట్ షేర్ కాగా.. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరింత పెరిగి 62.59 శాతం ఓట్ షేర్‌కు చేరింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా - గుంటూరు జిల్లాల్లో 58.19 శాతం ఓట్ షేర్ రాగా.. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది భారీగా పెరిగి 67.51 శాతం ఓట్ షేర్‌కు చేరింది. గత ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాధారణ ఎన్నికల్లో 58 శాతం ఓట్ షేర్ రాగా...నేడు 65 శాతం ఓట్ షేర్‌ను కూటమి సాధించింది. తాజా గెలుపుతో మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 5 గురూ కూటమి అభ్యర్థులే ఉన్నారు.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పట్టభద్రుల స్థానాలు గెలిచిన కూటమి...నేడు మరో రెండు స్థానాలను గెలుచుకొని.. 5 స్థానాలకు ఏగబాకింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన వారికి మూడవ స్థానం దక్కింది. అంతేకాదు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసే ధైర్యం వైసీపీ చేయలేక పోయింది. వైసీపీ మద్దతు కారణంగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మరింత నష్ట పోయారు.
Also Read: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం.. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్
Also Read: లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారు
వైసీపీ మద్దతు ప్రకటించిన తరువాత మరింత కసిగా తరలి వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా.. కూటమికి మద్దతుగా పట్టభద్రులు ఓటు వేశారు. 8 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల నమ్మకం మరింత పెరిగిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని స్పష్టమవుతోంది.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Mar 04 , 2025 | 07:28 PM