Journalist Welfare AP: ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఆలపాటి సురేశ్
ABN, Publish Date - May 27 , 2025 | 05:46 AM
ఆలపాటి సురేశ్‌ను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. పత్రికా రంగ అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమానికి ఆయన సేవలపై ఆశాభావం వ్యక్తమైంది.
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేశ్‌ను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం సురేశ్‌ను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగే ఆయనకు జీత భత్యాలు, ఇతర సౌకర్యాల వివరాలతో త్వరలో మరో జీవో వస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ సమాచార ప్రజా సంబంధాల శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. పాత్రికేయ రంగంలో ఉన్నత ప్రమాణాలను కాపాడటానికి, జర్నలిస్టుల సంక్షేమానికి ఆలపాటి సురేశ్ కృషి చేస్తారన్న విశ్వాసాన్ని జాప్ నాయకుడు వి.సత్యనారాయణ వ్యక్తం చేశారు.
Updated Date - May 27 , 2025 | 05:48 AM