Alipiri Check Point: అలిపిరిలో ఎయిర్ పిస్టల్ కలకలం
ABN, Publish Date - Jun 10 , 2025 | 04:41 AM
తిరుమల ముఖ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ తనిఖీల్లో సోమవారం ఎయిర్ పిస్టల్ బయటపడింది. బెంగళూరుకు చెందిన మహేష్ కుటుంబం తిరుమలకు కారులో వెళ్తుండగా ఓ బ్యాగులో ఇది కనిపించింది.
తిరుమల,జూన్ 9(ఆంధ్రజ్యోతి): తిరుమల ముఖ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ తనిఖీల్లో సోమవారం ఎయిర్ పిస్టల్ బయటపడింది. బెంగళూరుకు చెందిన మహేష్ కుటుంబం తిరుమలకు కారులో వెళ్తుండగా ఓ బ్యాగులో ఇది కనిపించింది. అందులో ఈక్వటోరియల్ టెలిస్కోప్ కూడా ఉండడంతో భద్రతా సిబ్బంది మహే్‌షను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన సోదరుడి కారు తీసుకువచ్చానని, అందులో ఏమున్నదీ తాను చూసుకోలేదని అతను చెప్పాడు. మహేష్ సోదరుడితో విజిలెన్స్ అధికారులు ఫోన్‌లో మాట్లాడగా, పిల్లల కోసం వాటిని కొనుగోలు చేశానని, కారు నుంచి వాటిని తీయడం మర్చిపోయినట్టు వివరించాడు. విచారణ కోసం మహే్‌షను అలిపిరి పోలీసులకు అప్పగించారు.
Updated Date - Jun 10 , 2025 | 04:44 AM