AP LAWCET: లాసెట్ రాసిన ఏబీవీ, ఎమ్మెల్యే సౌమ్య
ABN, Publish Date - Jun 06 , 2025 | 06:04 AM
రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గురువారం లాసెట్ పరీక్ష రాశారు. ఒంగోలు రైజ్ కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరైన వెంకటేశ్వరరావు అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఒంగోలు క్రైం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గురువారం లాసెట్ పరీక్ష రాశారు. ఒంగోలు రైజ్ కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరైన వెంకటేశ్వరరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం కంటే కూడా న్యాయశాస్త్రం చదవాలనే ఆసక్తితో లాసెట్ రాసినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై పలు అభియోగాలు మోపడంతో కోర్టులో ఆయన వాదనలను ఆయనే వినిపించారు.
న్యాయశాస్త్రం చదవాలని..: ఎమ్మెల్యే సౌమ్య
చట్టాలపై అవగాహన ఉంటే పాలనకు తోడ్పాటుగా ఉంటుందని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం ఏపీ లాసెట్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ, తన తండ్రి తంగిరాల ప్రభాకరరావు న్యాయవాదిగా పేదలకు సేవలందించారన్నారు. ఆయన సూర్తితో తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
Updated Date - Jun 06 , 2025 | 06:07 AM