Degree Colleges: 270 డిగ్రీ కాలేజీలపై వేటు
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:38 AM
కనీస స్థాయిలో అడ్మిషన్లు లేని ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు జారీచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,200 ప్రైవేటు డిగ్రీ కాలేజీలుండగా.. 270 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు నమోదవుతున్నాయి.
25 శాతం అడ్మిషన్లూ లేని కళాశాలలకు ఉన్నత విద్యామండలి నోటీసులు
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): కనీస స్థాయిలో అడ్మిషన్లు లేని ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు జారీచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,200 ప్రైవేటు డిగ్రీ కాలేజీలుండగా.. 270 కాలేజీల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు నమోదవుతున్నాయి. అందులో రెండు కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా రావట్లేదు. దీంతో ఈ కాలేజీలకు అడ్మిషన్లు ఎందుకు కొనసాగించాలో చెప్పాలని ఉన్నత విద్యామండలి వివరణ కోరుతోంది. కాలేజీల నుంచి వివరణ తీసుకోవడానికి ఉన్నత విద్యామండలి ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. కాలేజీల యాజమాన్యాలు ఆ కమిటీ ముందు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణపై కమిటీ సంతృప్తి చెందితే అనుమతులు కొనసాగిస్తారు. లేనిపక్షంలో ఆ కాలేజీలకు అనుమతులు నిలిపివేస్తారు. కాగా, గత ప్రభుత్వంలోనూ పలు కాలేజీలకు అనుమతులు ఆపేయగా, న్యాయస్థానం అనుమతితో కాలేజీలను కొనసాగించారు. ఇప్పుడైనా కఠిన చర్యలు తీసుకుంటారా? అనేది చూడాలి.
Updated Date - Jun 25 , 2025 | 04:38 AM