ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Guinness Record: సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డు

ABN, Publish Date - Jun 21 , 2025 | 06:15 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.

  • పాల్గొన్న 25 వేల మంది గిరిజన విద్యార్థులు

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25వేల మంది విద్యార్థులు పాల్గొని 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు. రికార్డు పత్రాన్ని శనివారం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు అందించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్‌ శాఖా మంత్రి ప్రతా్‌పరావ్‌ జాదవ్‌ మాట్లాడుతూ అడవి బిడ్డలు రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగస్వాములైన విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రపంచ రికా ర్డు సృష్టించడం ద్వారా దేశ గౌరవాన్ని మరింత పెంపొందించారని కొనియాడారు.

వీరిని పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, చరిత్రలో ఎన్న డూ లేనివిధంగా 25 వేల మంది విద్యార్థులు సూర్య నమస్కరాలు చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రతి విద్యార్థి అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సాధ్యమన్నారు. కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకువచ్చేలా కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం యత్నించాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు గుమ్మ డి సంధ్యారాణి, సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఉన్న తాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రు లు విద్యార్థులు వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. లోకేశ్‌ విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 06:21 AM