భార్యకు ప్రేమతో 8 అడుగుల స్మృతి చిహ్నం ..
ABN, Publish Date - Aug 30 , 2024 | 11:39 AM
వరంగల్ జిల్లా: మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఒకటైన ఆ దంపతులపై విధి వింతనాటకమాడింది. కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల పండంటి కాపురంలో విషజ్వరం చిచ్చుపెట్టి తన ఇల్లాలిని బలితీసుకుంది. కలకాలం కలిసి బతకాల్సిన ఆ యువజంట ఒంటరిగా మారడం ఇరు కుంటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
వరంగల్ జిల్లా: మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఒకటైన ఆ దంపతులపై విధి వింతనాటకమాడింది. కలకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల పండంటి కాపురంలో విషజ్వరం చిచ్చుపెట్టి తన ఇల్లాలిని బలితీసుకుంది. కలకాలం కలిసి బతకాల్సిన ఆ యువజంట ఒంటరిగా మారడం ఇరు కుంటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకోడానికి అప్పుడు షాజహాన్ తాజ్‌మహల్ కట్టిస్తే.. ప్రాణంగా ప్రేమించిన తన ఇల్లాలి కోసం ఈ ప్రేమికుడు కళ్లు చెమర్చే విధంగా 8 అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించి.. ఆమె జ్ఞాపకాలను పదిలం చేసుకున్నాడు.
హనుమకొండ జిల్లా, ఐనవోలు మండలం, వనమాల కనపర్తి గ్రామానికి చెందిన శివరాజుకు మానసతో 2018లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో వారిని చూసి విధికి కన్నుకుట్టింది. ఆ దేవుడు వారిపట్ల చిన్నచూపు చూసాడో ఏమో కానీ.. మానసకు అంతుబట్టని విషజ్వరం వచ్చింది. ఆమెను బతికించడానికి శివారాజు చేయని ప్రయత్నమంటూలేదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగాడు. ఎన్నో దేవుళ్లకు మొక్కాడు. తన అర్ధాంగిని కాపాడాలని వేడుకున్నాడు. కానీ ఏ దేవుడు కనికరించలేదు. చివరికి జ్వరం విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది ఆగస్టు 8న మానస మరణించింది. దీంతో శివరాజు గుండె బద్దలైంది. కన్నీరు మున్నీరుగా విలపించాడు. తన భార్య భౌతికంగా లేకపోయినా తనలోనే ఉందని ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు.
తన భార్య జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోవాలనే ఆకాంక్షతో మానస సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించి.. తన ప్రేమను భర్త శివరాజు చాటుకున్నాడు. తన భార్య తన నుంచి దూరమైనా.. ఆమె .జ్ఞాపకాలు పదిలం చేసుకోవడం కోసమే ఈ స్మృతి చిహ్నం ఏర్పాటు చేశానని శివరాజు అన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిందితులకు శిక్ష పడాలి: జెత్వాని
ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్ ఫోకస్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 30 , 2024 | 11:41 AM