ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raiparthy SBI Robbery: రాయపర్తి ఎస్‌బీఐ కేసు ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్

ABN, Publish Date - Dec 06 , 2024 | 06:40 PM

రాయపర్తి ఎస్‌బీఐలో కోట్లాది రూపాయిల బంగారం చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.

Warangal CP

వరంగల్, నవంబర్ 06: రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ శుక్రవారం వరంగల్‌లో వెల్లడించారు. వారి వద్ద నుంచి కోటి ఎనభై లక్షల రూపాయల విలువచేసే... 2 కిలోల 520 గ్రాముల బంగారం, కారుతోపాటు రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Also Read: విజయవాడ వేదికగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమం


ఈ ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారన్నారు. వారిలో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. మిగిలిన సొమ్మును సైతం వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుంటామని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ఈ ముఠా సభ్యుల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వారని వివరించారు.

Also Read: ఆ బియ్యం సంగతి తేల్చేందుకు రంగంలోకి స్పెషల్ ఆఫీసర్


నవంబర్ 18వ తేదీన రాయపర్తి ఎస్‌బీఐలో భారీ జరిగింది. బ్యాంకులో ఇనుప కిటికీలను గ్యాస్ కట్టర్‌తో తొలగించి.. దొంగలు లోపలికి ప్రవేశించారు. ఆ క్రమంలో బ్యాంక్‌లోని అలారం మోగకుండా ముందుగానే వైర్లు కట్ చేశారు. అలాగే సీసీ కెమెరాలు సైతం పగలకొట్టారు. ఫుటేజీని దొంగలు ఎత్తుకెళ్లారు.

Also Read: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ


బ్యాంకులోని వివిధ లాకర్లలో ఉంచి రూ.13 కోట్ల విలువైన 19 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే అక్టోబర్ మాసంలో ఇదే తరహా చోరీ కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఆ ముఠా పనేనంటూ పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో నాలుగు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: బెల్లం సున్నుండ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


దాదాపు ఐదు వందల మంది ఖాతాదారులకు చెందిన బంగారం చోరీకి గురు కావడంతో.. వారంతా తీవ్ర ఆందోళన చెందారు. మరోవైపు పోలీసులు ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

For Telangana News And Telugu news

Updated Date - Dec 06 , 2024 | 06:43 PM