Share News

Kakinada Port: ఆ బియ్యం సంగతి తేల్చేందుకు రంగంలోకి స్పెషల్ ఆఫీసర్

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:10 PM

కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం తరలింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.

Kakinada Port: ఆ బియ్యం సంగతి తేల్చేందుకు రంగంలోకి స్పెషల్ ఆఫీసర్
AP CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 06: కాకినాడ పోర్ట్ వేదికగా ప్రజా పంపిణి వ్యవస్థ బియ్యం విదేశాలకు తరలించడంపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యా్ప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సభ్యులుగా బి ఉమామహేశ్వర్, టి అశోక్ వర్ధన్, ఎం. బాలసుందర్రావు, ఆర్ గోవిందరావు, ఎం రత్తయ్యలు నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ 2103ను సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జారీ చేసింది.

Also Read: బెల్లం సున్నుండ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది. అలాగే సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టింది. పోర్టు ద్వారా బియ్యం విదేశాలకు రవాణా, కాకినాడ జిల్లాతోపాటు అందుకు సంబంధిత నేరాలపై విచారణ జరపాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా సిట్‌కు.. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం అందించేందుకు సహకరించాలని సూచించింది.

Also Read: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ


అలాగే తనిఖీ, సీజ్ చేసే అధికారంతోపాటు సాక్ష్యులను విచారించి తద్వారా పత్రాలను పొందే హక్కు సైతం సిట్‌కు ప్రభుత్వం కల్పించింది. అదే విధంగా చట్టపరంగా నిందితులను అరెస్ట్ చేసి.. విచారించే హక్కును సైతం సిట్‌కు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఇటీవల కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తించారు. ఆ క్రమంలో ఆ బియ్యం నిల్వ ఉన్న నౌకను సీజ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించిన విషయం విధితమే. అయితే ఇటీవల అమరావతిలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. వీరిద్దరు భేటీలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశం చర్చకు వచ్చినట్లు ప్రచారం జరిగింది.


అలాగే ఇ దే అంశంపై ఇటీవల కేబినెట్‌ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఆ క్రమంలో తాజాగా కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణాపై సిట్‌ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కాకినాడ పోర్ట్‌లో దాదాపు 40 శాతానికి పైగా వాటాను చైర్మన్ కేవీ రావుపై గత ప్రభుత్వంలోని వైసీపీ పెద్దలు ఒత్తిడి తీసుకు వచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. ఆ క్రమంలో వైసీపీ అగ్రనేతలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 05:10 PM