NTR: విజయవాడ వేదికగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమం
ABN , Publish Date - Dec 06 , 2024 | 05:55 PM
సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు, తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలి రా అంటూ నినదిస్తూ.. నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు.
అమరావతి, డిసెంబర్ 06: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సినీ, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు అని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ శుక్రవారం అమరావతిలో అభివర్ణించారు. ఆయన సినీ జీవితంలోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14వ తేదీన విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరవుతారని చెప్పారు.
Also Read: ఆ బియ్యం సంగతి తేల్చేందుకు రంగంలోకి స్పెషల్ ఆఫీసర్
వాారందరికి ఆహ్వానం..
అలాగే అక్కినేని, చిరంజీవి, రామానాయుడుల కుటుంబ సభ్యులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. వీరే కాకుండా నిర్మాతలు, సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా హాజరుకానున్నారని పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్‌తో కలిసి పని చేసిన వారితోపాటు అన్ని రాజకీయ పక్షాల వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. త్వరలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలను అన్ని భాషలలోను విడుదల చేస్తామని టీడీ జనార్దన్ ప్రకటించారు.
Also Read: బెల్లం సున్నుండ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్ర..
ఎన్టీఆర్ చరిత్ర త్వరలో పాఠ్య పుస్తకాలలో వచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలను భావితరాలకు అందించే ప్రయత్నమే ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల ప్రధాన ఉద్దేశ్యమని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, కర్ణాటకలలో కూడా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో త్వరలో ఎన్టీఆర్ పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా టీడీ జనార్దన్ ప్రకటించారు.
Also Read: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ
జస్ట్ తొమ్మిది నెలల్లో..
సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు, తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలి రా అంటూ నినదిస్తూ.. నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. అలా పార్టీని స్థాపించి.. జస్ట్ తొమ్మిది నెలలకే ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దీంతో తెలుగు వాడిలోని వాడి వేడిని.. దేశ రాజధాని హస్తినలో హస్తం పార్టీ అధిష్టానానికి రుచి చూపించిన ఒకే ఒక్కడు. ఈ ఎన్టీఆర్.
శత జయంతి జరుపుకొని..
అంతేకాదు.. ఆయన తీసుకు వచ్చిన సంక్షమే పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయంటే.. అది ఎన్టీఆర్‌కు ప్రజల పట్ల.. ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న నిబద్దతకు తార్కాణం. అదీకాక.. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఆ శక పురుషుడి జీవితంతోపాటు ఆయన అసెంబ్లీలో ప్రసంగించిన అంశాలపై టీడీ జనార్దన్ సారథ్యంలో పుస్తకాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.
కథానాయకుడు ప్లస్ మహానాయకుడు..
అదీకాకా..ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన. బీజేపీ కూటమిగా ఏర్పడి.. బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 130కిపైగా స్థానాలను ఒక్క టీడీపీనే గెలుచుకోవడం గమనార్హం. దీంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కథానాయకుడు ప్లస్ మహానాయకుడు స్థాపించిన పార్టీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టినట్లు అయింది.
For AndhraPradesh News And Telugu News