ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dhanasari Seethakka: పోలీసు బట్టలూడదీసిన స్మగ్లర్‌ సినిమాకు జాతీయ అవార్డా?

ABN, Publish Date - Dec 24 , 2024 | 03:15 AM

పోలీసు అధికారి బట్టలూడదీసిన సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చిందని, ఇది దేనికి సంకేతమని మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బాధ్యతాయుత స్థానంలో ఉండే పోలీసు అధికారి హేళన అయ్యాడని, స్మగ్లర్‌ హీరో అయ్యాడని వ్యాఖ్యానించారు.

  • ‘జైభీమ్‌’ను ఎందుకు విస్మరించారు?

  • ‘పుష్ప’పై మంత్రి సీతక్క వ్యాఖ్యలు

  • సినీ తారలది రాతి హృదయం రూపాయి కూడా ఖర్చు పెట్టరు

  • సోనూ సూద్‌, సమంత, మంచు

  • లక్ష్మి నయం: ఎమ్మెల్యే యెన్నం

  • సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు: ఎంపీ చామల

  • బెయిలుపై ఉన్న అర్జున్‌ ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టాడు?: వీహెచ్‌

  • అర్జున్‌వన్నీ అబద్ధాలే: రోహిన్‌రెడ్డి

హైదరాబాద్‌/పీర్జాదిగూడ/ములుగు కలెక్టరేట్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారి బట్టలూడదీసిన సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చిందని, ఇది దేనికి సంకేతమని మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బాధ్యతాయుత స్థానంలో ఉండే పోలీసు అధికారి హేళన అయ్యాడని, స్మగ్లర్‌ హీరో అయ్యాడని వ్యాఖ్యానించారు. ములుగులో సోమవారం జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాజ్యంగ స్ఫూర్తితో తాను ఈ స్థాయికి ఎదగగలిగానని ఆమె చెప్పారు. ఉద్యమం నుంచి న్యాయ శాస్త్రాన్ని చదవడంతోపాటు ఇప్పుడు రాష్ట్రమంత్రిగా నిలబడ్డానన్నారు. అలాంటి అంబేడ్కర్‌ స్ఫూర్తితో ఓ న్యాయవాది చంకలో బిడ్డ, కడుపులో మరో బిడ్డతో అన్యాయానికి గురైన మహిళ కోసం పోరాడిన కథతో వచ్చిన సందేశాత్మక చిత్రం జైభీమ్‌కు అవార్డులు రాలేదు కానీ, పోలీసు వ్యవస్థను, రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఓ స్మగ్లర్‌ కథతో వచ్చిన పుష్ప సినిమాకు జాతీయ పురస్కారం వచ్చిందని అన్నారు. పుష్ప సినిమా నేర ప్రవృత్తిని ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. సినిమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించేలా ఉండాలని, మంచి సందేశంతో సినిమాలు నిర్మించాలని ఆమె సూచించారు.


మీకంటే సోనూ సూద్‌, సమంత మంచు లక్ష్మి నయం: యెన్నం

అల్లు అర్జున్‌ వివాదం నేపథ్యంలో సినీ పరిశ్రమపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.30 వేల జీతం సంపాదించే అభిమాని రూ.3 వేలతో టికెట్‌ కొని సినీతారల స్టార్‌డం కాపాడుతున్నారని.. సూపర్‌ స్టార్లుగా పేర్కొనే నటులు వందల కోట్లు సంపాదిస్తున్నా.. సేవా కార్యక్రమాలకు రూపాయి కూడా ఖర్చు చేయరని ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మన సూపర్‌ స్టార్‌లు ఏ గ్రామాన్నైనా, ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రినైనా దత్తత తీసుకున్నారా? మంచి కార్యక్రమం చేయమని ఏనాడైనా అభిమానులకు పిలుపునిచ్చారా? అని ప్రశ్నించారు. బ్లడ్‌ బ్యాంక్‌ పేరుతో చిరంజీవి ఎంతోమందికి సేవ చేస్తూ అభిమానులతోనూ చేయిస్తుండగా.. ఆయన వారసులుగా చెప్పుకొనే కొంతమంది ఏనాడైనా పైసా సహాయం చేశారా? అని నిలదీశారు. సీఎం మాట్లాడిన మాటలు అబద్ధాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నారా? అసెంబ్లీని అగౌరవపరుస్తున్నారా? అని మండిపడ్డారు.


చిత్ర పరిశ్రమ నాలుగు కుటుంబాల చేతిలో నలిగిపోతోందని, తెలంగాణ వాళ్ల విషయంలో సినిమా ఇండస్ట్రీ ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసని అన్నారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా సినీ నటులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ నటిస్తున్నారని, పిల్లలకు పుస్తకాలు ఇద్దామని అంటే తనకేం వస్తుందని ఒక నటుడు అన్నాడని చెప్పారు. సినీతారలు రాతి హృదయంతో ఉంటారన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ వస్తారన్న నమ్మకం లేదని.. వీరి కంటే సోనూ సూద్‌, సమంత, మంచు లక్ష్మి నయం అని వ్యాఖ్యానించారు. వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ కృత్రిమ సమాజంలో బతుకుతున్నారని.. అర్ధరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీల్లో నటులు ఉంటారని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే ఒక్కరు కూడా స్పందించరన్నారు. తమిళ నటులకు ఉన్న సామాజిక స్పృహ తెలుగు నటులకు లేదన్నారు. సినీ నటులు ఏనాడైనా ఉద్యమంలో పా ల్గొన్నారా? అని శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు.


వివాదాన్ని కొనసాగించే ఆలోచన కాంగ్రె్‌సకు లేదు: చామల

అల్లు అర్జున్‌కు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వైరం లేదని, ఈ వివాదాన్ని కొనసాగించే ఆలోచన కాంగ్రె్‌సకు లేదని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారన్నారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదన్నారు. సినీ నిర్మాతలు నష్టపోవద్దని, పరిశ్రమ బాగుండాలనే దిల్‌ రాజుకు ఫిల్మ్‌ డెవల్‌పమెం ట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చామని చెప్పారు. హైదరాబాద్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధి జరిగిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే అని తెలిపారు.

బెయిలుపై ఉన్న అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టాడు?: వీహెచ్‌

ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్‌ కోలుకోవాలని మృత్యుంజయ యాగం చేయాలంటూ అల్లు అర్జున్‌కు కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ సూచించారు. పుష్ప2 సినిమాకు వచ్చిన డబ్బులను యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయాలన్నారు. బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టాడని ప్రశ్నించారు. ఈ అంశంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.

అర్జున్‌ చెప్పినవన్నీ అబద్ధాలే: రోహిన్‌రెడ్డి

అల్లు అర్జున్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. థియేటర్‌ నుంచి వెళ్లిపొ మ్మని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్‌ అక్కడ్నుంచి వెళ్లేందుకు ససేమిరా అన్నారని చెప్పారు.


300 కోట్లలో 3 కోట్లు ఇవ్వడానికి మనసు రావట్లేదా?: చనగాని

పుష్ప2 సినిమాకు రూ.300 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్‌కు అందులో నుంచి బాధిత కుటుంబానికి రూ.3 కోట్లు ఇవ్వడానికి మనసు రావట్లేదా అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఆయన నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం చల్లాచెదురైందన్నారు. బీజేపీ నేతలకు అల్లు అర్జున్‌పై ఉన్న ప్రేమ.. చనిపోయిన రేవతి కుటుంబంపై లేదని చెప్పారు.

పుష్ప2 సినిమాపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఫిర్యాదు

పుష్ప2 సినిమాపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూశానని.. కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని మల్లన్న చెప్పారు. గంధపు చెక్కల స్మగ్లర్‌ పెద్ద హీరోలా వచ్చి పోలీస్‌ అధికారి కారును ఢీకొట్టడం తదితర సన్నివేశాలు పోలీసులను అవమానించేలా ఉన్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 03:15 AM