R. Krishnaiah: బీసీ బిల్లు కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీ పంపాలి
ABN, Publish Date - Dec 28 , 2024 | 04:36 AM
పార్లమెంటులో బీసీ బిల్లు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి పంపి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
జనవరి 6న అమరావతిలో బీసీ సభ: ఆర్ కృష్ణయ్య
బర్కత్‌పుర, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంటులో బీసీ బిల్లు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి పంపి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏపీ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. క్రీమిలేయర్‌ను పూర్తిగా రద్దు చేయాలని, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 6న అమరావతిలో వేలాదిమందితో బీసీ సభ నిర్వహించి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకే్‌షలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - Dec 28 , 2024 | 04:36 AM