ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jupalli Krishna Rao: కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తాం

ABN, Publish Date - Jan 04 , 2024 | 04:26 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) లో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాగునీరు, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) లో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాగునీరు, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వ రాక్షసి పాలన పోయి.. ప్రజలు కోరుకున్న కాంగ్రెస్ పాలన వచ్చిందని చెప్పారు. ప్రజలు, అమరవీరుల ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో తాగు నీటి కోసం 40వేల కోట్లు ఖర్చు చేశారని.. ఆ మంచినీటి పథకం సక్రమంగా జరగలేదని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంచి పరిపాలన అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 04:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising