ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: రాకె ట్లలో వాడే తైవ్‌ను అభివృద్ధి చేసిన ఐఐసీటీ..

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:43 AM

రాకెట్‌, క్షిపణుల తయారీలో స్వాలంబన దిశగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ముందుడుగు వేసింది. రాకెట్లు, క్షిపణుల ప్రొపెల్లెంట్స్‌లో ఉపయోగించే (చైనాలేక్‌ 20) సీఎల్‌-20 తయారీకి అవసరమైన అత్యంత శక్తివంతమైన ఇంధనాన్ని హై దరాబాద్‌కు చెందిన ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌తో కలిసి అభివృద్ధి చేసింది.

హైదరాబాద్‌, జూన్‌ 15: రాకెట్‌, క్షిపణుల తయారీలో స్వాలంబన దిశగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ముందుడుగు వేసింది. రాకెట్లు, క్షిపణుల ప్రొపెల్లెంట్స్‌లో ఉపయోగించే (చైనాలేక్‌ 20) సీఎల్‌-20 తయారీకి అవసరమైన అత్యంత శక్తివంతమైన ఇంధనాన్ని హై దరాబాద్‌కు చెందిన ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌తో కలిసి అభివృద్ధి చేసింది. సీఎల్‌-20 సంప్రదాయ ఆర్‌డీఎక్స్‌ కంటే మెరుగైన ఆక్సిడైజర్‌ ఇంధన నిష్పత్తిని కలిగి ఉంటుంది. అలాగే ఎక్స్‌ఎంఎస్‌ ఆధారిత ప్రొపెల్లెంట్‌ కంటే 20 శాతం అధిక శక్తిని కలిగి ఉంటుంది.


సీఎల్‌-20ని అత్యంత ఖరీదైన (టీఎఐడబ్ల్యూ) తైవ్‌ అనే పదార్థం నుంచి తయారు చేస్తారు. సీఎల్‌-20ని తయారు చేసేందుకు గాను భారత్‌ భారీగా ఖర్చు చేసి తైవ్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తైవ్‌ను మన దేశంలోనే తయారు చేసుకునేందుకు అవసరమైన కీలక ఉత్ర్పేరకాన్ని ఐజీసీటీ శాస్త్రవేత్త ఎన్‌.లింగయ్య సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ ఉత్ర్పేరకాన్ని తక్కువ ఖర్చుతో, పర్యావరణహితంగా తయారు చేసినట్లు ఐఐసీటీ వెల్లడించింది. దీనిపై ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సంస్థతో సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి ఒప్పందం చేసుకున్నట్లు ఐఐసీటీ శనివారం తెలిపింది.

Updated Date - Jun 16 , 2024 | 05:43 AM

Advertising
Advertising