ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన అధ్యక్షుడు..!

ABN, Publish Date - Feb 19 , 2024 | 09:38 PM

BJP Alliance with BRS: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు(Telangana) మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీజేపీ(BJP)-బీఆర్ఎస్(BRS) మధ్య పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది. అయితే, ఎన్నికల వేళ ఈ చర్చ..

BJP Alliance with BRS

హైదరాబాద్, ఫిబ్రవరి 19: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు(Telangana) మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీజేపీ(BJP)-బీఆర్ఎస్(BRS) మధ్య పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది. అయితే, ఎన్నికల వేళ ఈ చర్చ.. బీజేపీని చాలా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు చాలా సీరియస్‌గా స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్‌తో పొత్తు అంశంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ఎవరైనా టీఆర్ఎస్, బీజేపీ పొత్తు గురించి మాట్లాడితే లాగి చెంప చెళ్లుమనిపించండి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక చెంప కాదు.. రెండు చెంపలు పగలగొట్టండి అంటూ సీరియస్ అయ్యారు.

పొత్తు లేదు..

‘తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న.. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందనే దుష్ప్రచారాన్ని నమ్మకండి. మెడ మీద తలకాయ లేనోడే బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్‌తో బీజేపీ కలుస్తుందా? ఎందుకు కలుస్తుంది? అలా అనుకున్నోడు మూర్ఖుడు. మూర్ఖత్వంతోనే బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అనేవి పనికిరాని మాటలు. కుట్రపూరితంగా బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవసరం ఇక తెలంగాణకు లేదు. బీజేపీకి కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటుకు అవసరం ఉందా? మూర్ఖులు, దుర్మార్గులు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ ఖాతర్ చేయదు. భారతీయ జనతా పార్టీ ధైర్యం, దమ్మున్న పార్టీ. ఏదైనా డైరెక్ట్‌గా ప్రజలకు చెబుతాం. తెర వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారాన్ని పంచుకున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయి.’ అని అన్నారు కిషన్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 09:38 PM

Advertising
Advertising