ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivas Goud: కాటమయ్య రక్షణ కవచం పథకంపై మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN, Publish Date - Jul 15 , 2024 | 07:36 PM

కాటమయ్య రక్షణ కవచం పథకం(Katamayya Rakshaka Kavacham Scheme) కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన కాటమయ్య మోకులు మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తయారైనవే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధించిన కోడ్ వల్ల అప్పుటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేకపోయినట్లు ఆయన చెప్పారు.

BRS leader srinivas Goud

హైదరాబాద్: కాటమయ్య రక్షణ కవచం పథకం(Katamayya Rakshaka Kavacham Scheme) కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన కాటమయ్య మోకులు మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తయారైనవే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధించిన కోడ్ వల్ల అప్పుటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేకపోయినట్లు ఆయన చెప్పారు. మోకుల తయారీకి కేసీఆర్ ప్రభుత్వంలోనే రూ.15కోట్లు మంజూరు చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ట్యాంక్ బండ్‌పై సర్దాన్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పారు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీసీ ఆత్మ గౌరవ భవనాలను పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని హితవు పలికారు. కల్లు దుకాణాలకు శాశ్వత లైసెన్సులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. గీత కార్మికుల పెన్షన్‌ రూ.4వేలకు పెంచాలని, అలాగే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.10లక్షలు చేయాలని, ద్విచక్రవాహనాలు(మోపెడ్) వెంటనే వారికి ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:

Crime News: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన డ్యాన్స్ మాస్టర్‌కు దేహశుద్ధి..

Updated Date - Jul 15 , 2024 | 07:38 PM

Advertising
Advertising
<