ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jaggareddy: వ్యక్తిగత విషయాలు చెప్పి జగ్గారెడ్డి భావోద్వేగం!

ABN, Publish Date - Feb 22 , 2024 | 01:22 PM

Telangana: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా ముందు తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టుకున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తన జీవితమంతా కష్టాలతోనే గడిచిందని వాపోయారు. తనకి అలా రాసిపెట్టి ఉందని చెప్పుకున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jagga Reddy) మీడియా ముందు తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టుకున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తన జీవితమంతా కష్టాలతోనే గడిచిందని వాపోయారు. తనకి అలా రాసిపెట్టి ఉందని చెప్పుకున్నారు. ‘‘ఉత్తమ్ (Uttam Kumar Reddy) ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు నన్ను పిలిచి రాహుల్ సభ పెట్టాలని అడిగారు.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో కేసీఆర్ (BRS Chief KCR) సొంత జిల్లాలో లక్షమందితో సభ పెట్టా. హరీష్‌ రావు (Former Minister Harish Rao) నన్ను టార్గెట్ చేసి జైల్లో వేయించారు. నా దూకుడుకి హరీష్ తట్టుకోలేకపోయారు. నా పని విధానంతో హరీష్ రావుకు పిచ్చెక్కి పోయింది. చక్రాలు తిప్పే హరీష్ రావు జిల్లాలో నా మార్క్ చూపించాను. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ గెలిచిన ఆనందంలో నేను ఓడిపోయిన బాధ మర్చిపోయాను. నేను ఏ బాధ్యత అయితే నిర్వహిస్తానో ఆ బాధ్యత నాకు వస్తది. టైం పట్టినా నాకు రావలసింది నాకు వస్తది. నేను పీసీసీ పదవి కోసం ఐదేండ్లుగా అడుగుతూనే ఉన్నాను. రేవంత్ (CM Revanth Reddy) ఆధ్వర్యంలో అందరం పనిచేసి 14 సీట్లు గెలిచి తీరుతాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. రాహుల్ ప్రధాని కావడానికి తెలంగాణ నుంచి 14 మంది ఎంపీలను ఇస్తాం’’ అని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 01:52 PM

Advertising
Advertising